Delhi CM:న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్ వర్మకు బిజెపి అధిష్టానం బిగ్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఆయనకు సీఎం పదవి ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఢిల్లీ సీఎం గా రేఖాగుప్తాను ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి పదవి పర్వేష్ వర్మకు ఇస్తారని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఆయనకు ఏ పదవి ఇస్తారని తీవ్ర చర్చ నడుస్తోంది. గెలుపుపై తిరుగులేని ధీమాతో ఉన్న అరవింద్ కేజ్రివాల్ ను 4089 ఓట్ల తేడాతో ఓడించారు వర్మ. బిజెపికి అతిపెద్ద సవాలుగా ఉన్న కేజ్రివాల్ ను ఓడించడం ద్వారా పర్వేష్ వర్మ జాయింట్ కిల్లర్ గా నిలిచారు. న్యూ ఢిల్లీ నియోజకవర్గం జాట్ ఆధిపత్యం ఉన్న సీటు కానప్పటికీ జాట్ వర్గాన్ని బీజేపీ నిర్లక్ష్యం చేస్తుందని తరచు ఆప్ విమర్శలు చేస్తూనే ఉంది. ఇందుకు ప్రతిగా జాట్ నేత వర్మనే బిజెపి ఇక్కడ నిలబెట్టింది. కరుడగట్టిన హిందూత్వ వాదిగా వర్మకు పేరుంది.
ముస్లింలను బుజ్జగించడం ఢిల్లీలో అక్రమంగా ముస్లిం బంగ్లాదేశీయులు తిష్ట వేసిన అంశాలను ఎండగట్టడం లో పర్వేష్ వర్మ ముందున్నారు. దూకుడుగా వ్యవహరించే ఈయనకే పట్టం కడతారనేది అందరు అనుకున్నారు. కానీ చివరగా కేజ్రీవాల్ సామాజిక వర్గానికి చెందిన నేతనే ఢిల్లీ సీఎం పీఠం కట్టబెట్టింది బీజేపీ అధిష్ఠానం.
మొత్తంగా జరిగిన ఈ నాటకీయ పరిణామంలో ఒక ఆసక్తికర అంశం ఏందంటే మొదటి నుంచి సీఎం రేస్ లో ఆ పర్వేష్ వర్మ ముందున్నారు. ఎవరైతే మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించాడో సీఎం రేస్ లో ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. మీడియాతో పాటు బీజేపీ వర్గాలు కూడా ఆయనే నెక్ట్స్ సీఎం అంటూ జోరుగా జోరీగాల ప్రచారం నిర్వహించారు. అయితే చివరాఖరికు రేఖా గుప్తాను ఢిల్లీ సీఎంను చేసింది బీజేపీ అధిష్ఠానం. అయితే పర్వేష్ వర్మ ముందు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీని సీఏఏ, ఎన్ఆర్సీ వంటి విషయాల్లో ఆయా పార్టీల తీరును తీవ్రంగా ఎండగట్టడంతో ముందున్నారు. అప్పట్లో ఢిల్లీ సీఎంగా ఉన్న షీలా దీక్షిత్ ను ఎమ్మెల్యేగా ఓడించిన అరవింద్ కేజ్రీవాల్.. ఆ తర్వాత ఢిల్లీ సీఎం అయ్యారు. ఇపుడు అదే తరహాలో ఢిల్లీ సీఎంగా చేసిన అరవంద్ కేజ్రీవాల్ ను ఓడించడం ద్వారా ఒక్కసారిగా పాపులర్ అయ్యారు పర్వేష్ వర్మ.
ఇప్పుడున్న సమాచారం ప్రకారం పరమేష్ వర్మకు కనీసం డిప్యూటీ సీఎం కూడా దక్కే అవకాశం లేనట్టుగా స్పష్టం అవుతోంది. అయితే కనీసంరేఖా గుప్తా క్యాబినెట్ లో కూడా చోటు ఉంటుందా లేదా అనేది అనేది కూడా చూడాలి. బీజేపీఅధిష్టానం ఎందుకు పర్వేష్ వర్మ పేరును పరిగణనలోకి తీసుకోలేదనే చర్చ ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో పర్వేష్ కన్నారేఖా గుప్తా ఇస్ ద పర్ఫెక్ట్ ఎంపిక అంటున్నారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
ఎందుకంటే సామాజిక వర్గంగా పరంగా చూసుకున్నా.. అందులోనూ మహిళా కోటలో రేఖ గుప్త అయితే బాగుంటుందనే కోణంలో ఆమెను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. బీజేపీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు. ఆప్ ను ఎండగడుతూ అంటే ఆపుకు ఇరుకు పట్టిన విధంగాచాలా మంది ఇంకా బిజెపి రేస్ లో ఉన్నారు. మొత్తంగా కొన్ని ఈక్వేషన్స్ కారణంగా ఆయనకు పదవి దక్కలేదని చెప్పాలి.
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.