Vizag woman suicide incident: కొంత మంది ఇటీవల పెళ్లి చేసుకుని తమ భార్యల పట్ల పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. వంట చేయడంరాదని, అందంగా లేదని కొంత మంది వేధిస్తున్నారు. మరికొందరు పెళ్లిచేసుకుని తమ భార్యలను కేవలం పడక సుఖం కొరకు మాత్రమే అన్న విధంగా ప్రవర్తిస్తున్నారు. మరికొందరు నీలిచాత్రాలకు బానీసై.. అచ్చం దానిలో ఉండే విధంగా తమతో గడపాలని కూడా వేధింపులకు గురిచేస్తున్నారు.
అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఘటన ఏపీలోని వైజాగ్ లో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు చనిపోయిన మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేశారు. పోలీసుల విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో మహిళ భర్త నాగేంద్ర బాబు పూర్తిగా నీలిచిత్రాలకు బానిసయ్యాడని విషయం బైటపడింది. పెళ్లైన నాటి నుంచి ప్రతిరోజు నీలిచిత్రాలను భార్యకు చూపిస్తు.. అచ్చం అలానే చేయాలని వేధించేవాడని విషయం బైటపడింది.ఈ క్రమంలో మహిళ వేధింపులు భరించలేక చివరకు ఆత్మహత్య చేసుకుంది.
ఈ క్రమంలో పోలీసులు.. అతని ఫోన్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతని మొబైల్ హిస్టరీ చూడగా.. వందలాది నీలి చిత్రాల వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతే కాకుండా.. అతను మరికొందరిలో కూడా ప్రేమాయణం నడిపినట్లు కూడా ఫోన్లలో వీడియోలు, కాల్స్ డాటా దొరికినట్లు సమాచారం. మరికొందరు మహిళల్ని కూడా ట్రప్ చేశాడని పోలీసులు గుర్తించారు. మరోవైపు ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అదే విధంగా నిందితుడ్ని కఠినంగా పనిష్మెంట్ చేయాలని కూడా పీఎస్ వద్ద తమ నిరసన తెలియజేస్తున్నారు. మొత్తానికి ఈ ఘఠన మాత్రం రెండు తెలుగు స్టేట్స్ లలో సంచలనంగా మారిందని చెప్పుకొవచ్చు.
పెళ్లి చేసుకుని ఎన్నో ఆశలతో అత్తారింటికి వచ్చిన మహిళ.. తన భర్త పెట్టిన టార్చర్ కు తన నూరెళ్ల జీవితంను మధ్యలోనే బలవంతంగా చాలించుకుంది. మరోవైపు మహిళ బంధువులు మాత్రం.. ఇది ఆత్మహత్య కాదని, ఆమె భర్త, అత్తింటివాళ్లు చేసిన హత్య అని కూడా ఆరోపణలు చేస్తున్నారు. మొత్తంగా ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter