Maha Kumbh@50 CR:ప్రయాగ్ రాజ్ లోని గంగా, యమున, సరస్వతీ నదుల సంగమ స్థానంలో శుక్రవారం అంటే ఫిబ్రవరి 14న ఒక్కరోజే 92 లక్షల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారని పేర్కొంది. భారత్, చైనాలు మినహా మిగతా దేశాల జనాభా కంటే ఈ సంఖ్యే ఎక్కువ. అమెరికా, రష్యా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల జనాభా కూడా 50 కోట్ల కంటే తక్కువే అని ఉత్తర ప్రదేశ్ సర్కారు తెలిపింది.
ఫిబ్రవరి 26 వరకు మహాకుంభ మేళా కొనసాగనుంది. అప్పటివరకు మరిన్ని కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. ఇందుకోసం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. జనవరి 29న త్రివేణీ సంగమంలో తొక్కిసలాట ఘటన జరగగా, పలువురు భక్తులు చనిపోయారు. అయినా పుణ్యస్నానాల కోసం తరలివచ్చే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. కాగా కుంభమేళా ఏర్పాట్లకి రూ. 1500 కోట్ల పెట్టుబడి పెడితే 3 లక్షల కోట్ల రాబడి వచ్చిందని సీఎం యోగి ఆదిత్యనాధ్ స్వయంగా ప్రకటించారు. కుంభమేళాకు వస్తున్న భక్తుల సంఖ్యతో ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యిందన్నారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, తన సతీమణి అమృతా ఫడణవీస్, కుమార్తె దివిజలతో కలిసి ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. మహాకుంభ మేళాలో భక్తుల కోసం అద్భుతమైన ఏర్పాట్లు చేశారని దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు. ఇందుకు గానూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఆయన అభినందనలు తెలిపారు.
మహాకుంభ మేళాకు వస్తున్న ప్రతీ భక్తుడు సంతోషంగా ఉన్నాడు. భారీ సంఖ్యలో భక్తుల రాకతో ఈసారి మేళా సరికొత్త రికార్డును సృష్టించింది అని దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పారు. మహాకుంభ మేళాలో ఇంత చక్కటి ఏర్పాట్లు చేసినందుకు మేం సీఎం యోగికి ధన్యవాదాలు తెలిపారు. తదుపరి కుంభమేళా మహారాష్ట్రలోని నాసిక్‌లో జరుగుతుంది. దాన్ని కూడా ఇదేవిధంగా విజయవంతం చేయడంపై మేం ఫోకస్ పెడతామన్నారు దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృతా ఫడణవీస్ చెప్పారు.
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.