Pawan Kalyan: దక్షిణాదిలో జనసేనాని సనాతన ధర్మ పరిరక్షణ యాత్ర.. పవన్ యాత్రల వెనక అసలు వ్యూహం అదేనా..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక బాట పట్టారు. నిన్న మొన్నటి వరకు స్పాండిలైటిస్ తో బాధ పడ్డ జనసేనాని .. ఇపుడిపుడే కోలుకుంటున్నారు. దీంతో దక్షిణాదిలో ఆధ్యాత్మిక బాట పట్టారు. పవన్ యాత్రల వెనక అసలు వ్యూహం వెనక అసలు ఉద్దేశ్యం అదేనా ?

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 12, 2025, 10:48 AM IST
Pawan Kalyan: దక్షిణాదిలో జనసేనాని సనాతన ధర్మ పరిరక్షణ యాత్ర.. పవన్  యాత్రల వెనక అసలు వ్యూహం అదేనా..

Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో సందర్శించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో  పలు పుణ్య క్షేత్రాలు దర్శించుకునే యాత్రకి ఈ రోజు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి  కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకుంటారు.  మరోవైపు ఆయన కేరళలోని పలు ఆలయాలను సందర్శించనున్నారు.

తిరుమల లడ్డూ వ్యవహారంతో పవన్ కళ్యాణ్.. సనాతన బోర్డ్ అంటూ దేశ వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. అంతేకాదు తిరుమలలో ప్రాయశ్చిత యాత్ర అంటూ చేపట్టిన యాత్ర సంచలనం రేపింది. అంతేకాదు దక్షిణాది యోగి అంటూ పవన్ కళ్యాణ్ పేరు మారు మాగిపోయింది. తాజాగా ఈయన దక్షిణాదిలో అందులో కేరళతో పాటు తమిళనాడులో ఉన్న ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు. 2026లో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి. అక్కడ భారతీయ జనతా పార్టీని బలంగా నిలబెట్టాలనే ఉద్దేశ్యంతో బీజేపీ పెద్దలు దక్షిణాదిలో పవన్ కళ్యాణ్ ను ట్రంప్ కార్డు ల వాడుకోబోతున్నారా అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

ఈ యాత్రలో పవన్ కళ్యాణ్.. 4 రోజుల పాటు అరుణాచలం, అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, పరుసరామస్వామి, అగస్థ్య జీవసమాధి కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వరస్వామి, కంచి కామాక్షితో అనంత పద్మనాభ స్వామి తదితర ఆలయాలను సందర్శించనున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.ఈ ఆలయాల సందర్శన ఈ నెల 16 వరకు ఉంటుంది. ఈ సందర్శనలో భాగంగా పవన్ కళ్యాణ్ కొన్ని ప్రదేశాల్లో ప్రసంగించబోతున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే తమిళనాడు మాజీ ఐపీఎస్ అన్నామలై ఇప్పటికే తన పాదయాత్రతో అక్కడ బీజేపీకి మంచి ఊపు తీసుకొచ్చారు. అంతేకాదు ఆ పార్టీకి సీట్లు రాకపోయినా.. ఓట్ల శాతాన్ని డబుల్ డిజిట్ కు చేర్చడంలో అన్నామలై పాత్రను కొట్టిపారేయలేము. అంతేకాదు తమిళనాడులో బీజేపీ పార్టీ అంటూ ఒకటుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ల కలిగారు. ఇక ద్రవిడ పార్టీలను ఆదరించే తమిళనాడులో అన్నాడీఎంకే కంటే బీజేపీ ఓట్ల శాతమే మెరుగ్గా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీకి కొరకరాని కొయ్యలా మారిన తమిళనాడు, కేరళల్లో పవన్ కళ్యాణ్ ను ముందుంచి రాజకీయం నడిపించాలనే ఉద్దేశ్యంతోనే భారతీయ జనతా పార్టీ పెద్దల సూచన మేరకే  పవన్ కళ్యాణ్ ఈ టూర్ ప్లాన్ చేసినట్టు రాజకీయా వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News