animal fat in Tirumala laddu row: తిరుమలలో ఇటీవల లడ్డు వివాదం పెను దుమారంగా మారింది. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు దేశంలో దుమారంను తెప్పించాయి. తిరుమల లడ్డులో పందికొవ్వు, జంతువుల వ్యర్థాలు ఉన్నట్లు చంద్రబాబు సర్కారు ఆరోపణలు చేసింది. గత వైఎస్సార్సీపీ సర్కారు తిరుమల లడ్డు విషయంలో నాణ్యతను పట్టించుకోలేదన్నారు.
దీని వల్ల తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేశంలోనే కాకుండా..కోట్లాది మంది భక్తులు సైతం తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. ఈ ఘటన ఏకంగా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లింది.
సుప్రీంకోర్టు ఆదేశాలతో లడ్డు వివాదంపై ప్రత్యేకంగా హైదరబాద్ డివిజన్ జాయింట్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు, విశాఖ సీబీఐ ఎస్పీ మురళిరాంబతో పాటు, ఏపీ నుంచి విశాఖ డీఐజీ గోపినాథ్ జెట్టి, గుంటూరు ఐజీ సర్వశ్రేష్టి త్రిపాఠి, ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారి సత్యకుమార్ పాండా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దర్యాప్తు బృందం దీనిపై విచారణ చేపట్టింది.
అయితే.. దీనిపై దర్యాప్తు చేపట్టన సిట్ ఇప్పటికే లోతుగా విచారణ ప్రారంచింది. తాజాగా.. ఈ ఘటనలో నలుగురిని సిట్ అరెస్టు చేసింది. వీరిలో.. ఏఆర్ డెయిరీ, పరాగ్ ఫుడ్స్ , ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, ఆల్ఫా మిల్క్ పుడ్స్ ప్రతి నిధులు ఉన్నారు.
Read more: Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ భారీ శుభవార్త.. ఆ టికెట్లు ఇక నుంచి డబుల్.. డిటెయిల్స్..
మొత్తంగా నిందితుల్ని అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు.. సోమవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా తిరుమల లడ్డు వివాదంపై ఏర్పాటైన సిట్ లో.. సీబీఐ జేసీ వీరేష్ ప్రభు తిరుపతిలోనే ఉండి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలో సిట్ ఏకంగా నలుగుర్ని అరెస్ట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter