Beef Biryani Dispute: యూనివర్శిటీలో బీఫ్ బిర్యానీ వివాదం, లంచ్‌లో వడ్డించాలని నోటీసులు

Beef Biryani Dispute: అలీఘర్ ముస్లిం యూనివర్శిటీలో కొత్త వివాదం చోటుచేసుకుంది. యూనివర్శిటీలో బీఫ్ బిర్యానీ అంశం వివాదాస్పదంగా మారింది. అసలేం జరిగింది, పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 9, 2025, 08:29 PM IST
Beef Biryani Dispute: యూనివర్శిటీలో బీఫ్ బిర్యానీ వివాదం, లంచ్‌లో వడ్డించాలని నోటీసులు

Beef Biryani Dispute: ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ ముస్లిం యూనివర్శిటీలో బీఫ్ బిర్యానీ అంశం వివాదం రేపుతోంది. మెనూలో బీఫ్ బిర్యానీ వడ్డించాలనే అధికారిక నోటీసులు కలకలం రేపుతున్నాయి. వర్శిటీ అధికారులు వివరణ ఇచ్చినా వివాదం సద్దుమణగడం లేదు. 

అలీఘర్ ముస్లిం యూనివర్శిటీలో ఇప్పుడు వాతావరణం వేడెక్కుతోంది. యూనివర్శిటీలోని సర్ షా సులైమాన్ హాల్‌లో ఇవాళ ఆదివారం మద్యాహ్నం లంచ్‌లో బీఫ్ బిర్యానీ వడ్డించాలంటూ జారీ అయిన ఇంటర్నల్ నోటీసు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వర్శిటీకు చెందిన ఇద్దరు  అధికారులు ఈ నోటీసు జారీ చేశారు. ఈ నోటీసు సారాంశం ఏంటంటే..ఆదివారం లంచ్ మెనూ మార్చబడింది. డిమాండ్ మేరకు చికెన్ బిర్యానీ బదులు బీఫ్ బిర్యానీ వడ్డించబడుతుంది అని ఉంది. ఈ నోటీసు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం మొదలైంది. వర్శిటీలో కూడా అంతర్గతంగా విద్యార్ధుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మొదట్లో ఈ వివాదంపై యూనివర్శిటీ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆ తరువాత పరిస్థితి తీవ్రం కావడంతో వర్శిటీ అధికారులు వివరణ ఇచ్చుకున్నారు. 

యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్ టైపింగ్ ఎర్రర్ అంటూ తేల్చారు. అయినా సరే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ వివాదాస్పద నోటీసులు జారీ చేసిన ఇద్దరు అధికారులకు వర్శిటీ నుంచి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఘటనపై బీజేపీకు చెందిన వర్శిటీ మాజీ విద్యార్ధులు మండిపడుతున్నారు. ఇది టైపింగ్ ఎర్రర్ కాదని, కావాలనే అలా చేశారంటున్నారు. ముస్లిమేతర విద్యార్ధుల మనోభావాలతో వర్శిటీ ఆటలాడుతుందని విమర్శిస్తున్నారు. 

Also read: Thandel Real Hero: తండేల్ కధ రియల్ హీరో వైఎస్ జగన్, అసలు సినిమాకు జగన్‌కు ఉన్న సంబంధమేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News