Pawan kalyan: అల్లు అరవింద్ మాస్టర్ స్కెచ్...!.. సీఎం పీకేగా మారిపోయిన డిప్యూటీ సీఎం.. మ్యాటర్ ఏంటంటే..

deputy cm pawan kalyan: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈక్రమంలో అల్లు అరవింద్ వేసిన మాస్టర్ స్కెచ్ వార్తలలో నిలిచింది.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 9, 2025, 10:46 PM IST
  • బిగ్ ట్విస్ట్ ఇచ్చిన అల్లు అరవింద్..
  • పండగ చేసుకుంటున్న అభిమానులు..
Pawan kalyan: అల్లు అరవింద్ మాస్టర్ స్కెచ్...!.. సీఎం పీకేగా మారిపోయిన డిప్యూటీ సీఎం.. మ్యాటర్ ఏంటంటే..

Allu Aravind ott platform aha announcement viral: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల అనారోగ్యంకు గురయ్యారు. కొన్నిరోజులుగా ఆయన జ్వరం, స్పాండిలైటీస్ సమస్యలతో బాధపడ్డారు. తాజాగా, ఆయన కోలుకుంటున్నారు. అయితే.. ఆయన ఒక వైపు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటునే, మరోవైపు హరిహరవీరమల్లు షూటింగ్ లో కూడా బిజీగా ఉంటున్నారు. 

ఈ నేపథ్యంలో ఆయన అనారోగ్యం వల్ల సినిమా షూటింగ్ కు వాయిదా వేసుకున్నారు. పూర్తిగా కోలుకున్నాక మాత్రమే హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. మరోవైపు పవన్ కళ్యాన్ పబ్లిక్ కార్యక్రమాల్లో, మీటింగ్ లలో ఎక్కడికి వెళ్లిన ఆయన అభిమానులు ఓజీ.. ఓజీ.., సీఎం... సీఎం.. అంటూ నినాదాలు చేశారు.

అదే విధంగా తరచుగా ఆయన నినాదాలను చేస్తు ఉంటే.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం, ఇలాంటి నినాదాలు చేయోద్దని పలు సందర్భాలలో అభిమానులకు రిక్వెస్ట్ సైతం చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం  సీఎం పీకే అనే ఒక అనౌన్స్ మెంట్ సోషల్ మీడియాలో తెగ రచ్చకు దారితీసింది. దీని వెనుక అసలు కారణం  ఏంటంటే.. 

 ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహ తాజాగా 'సీఎం పీకే' అనే అనౌన్స్‌మెంట్ చేసింది. దీనికి మోస్ట్ పవర్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ మీ ముందుకు వస్తుందని క్యాప్షన్ జతచేశారు. అయితే.. దీనిపై సీఎం పీకే అని టైటిల్  ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Read more: Viral Video: పెళ్లిలో షాకింగ్ ఘటన.. డ్యాన్స్ చేస్తు స్టేజీ మీదనే కుప్పకూలీన యువతి.. వీడియో వైరల్..

మరీ ఇది పవన్ కళ్యాన్ కోసం కావాలని పెట్టారా.. మరేంటీ సంగతి అని పవన్ కళ్యాణ్ అభిమానులు దీనిపై విపరీతంగా చర్చలు చేసుకుంటున్నారు. మొత్తంగా సీఎం  పేకే పేరు మాత్రం సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో సెన్సెషన్ హిట్ బజ్ ను క్రియేట్ చేసింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News