Girl harassed with her boy friend in ntr district: ఇటీవల కాలంలో యువతీ,యువకులు రెచ్చిపోతున్నారు. తమ అవసరాల కోసం ప్రేమను పావుగా వాడుకుంటున్నారు. ఒకరిపై మరోకరు కపటమైన ప్రేమను చూపిస్తున్నారు. తమ అవసరాలు తీరేంత వరకు మంచిగా ఉండి.. ఫ్లడ్ చేస్తు ఆ తర్వాత ఒక్కసారిగా ఊసర వెల్లులే సిగ్గు పడే మాదిరిగా రంగులు మారుస్తున్నారు.
ఇలాంటి ఘటనల్లో కొంత మంది అమ్మాయిలు కూడా మరికొందరు అబ్బాయిలకు మంచి పోటీని ఇస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కంచికచర్ల పరిధిలో చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.న ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న ఓ యువతి సమీపంలోని పరిటాలలో సహాచర విద్యార్థినులతో కలిసి ఉంటుంది.
ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందని గాలి సైదా అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త చనువు ఎక్కువై ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు కలిసి సీక్రెట్ గా కాలేజీలు డుమ్మా కొట్టి మరీ తిరిగే వారు. ఈ నేపథ్యంలో సైదా, సదరు యువతికి మాయమాటలు చెప్పి ఆమెను లోబర్చుకున్నాడు. ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశారు. అదే సమయంలో ఫోటోలు కూడా తీశాడు.
అప్పటి నుంచి యువతిని తనచుగా ఆ ఫోటోలు చూపిస్తు బెదిరింపులకు గురిచేశాడు. ఆ ఫోటోలను తమఫ్రెండ్స్ కు చూపించాడు. వాళ్లు కూడా యువతిని వేధించడంతో, సదరు యువతి విసిగిపోయింది. వెంటనే తనకు చేస్తున్న బ్లాక్ మెయిల్ గురించి ఇంట్లో వాళ్లకు చెప్పింది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ప్రస్తుతం పెనుదుమారంగా మారింది. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter