Atishi Marlena Resign to CM Post: నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఢిల్లీలో దాదాపు 27 యేళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చింది. దీంతో ఆ బీజేపీ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి. ఢిల్లీ ఎన్నికల ఓటమి నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆతిషీ మార్లానా తన పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను ఢిల్లీ ఎఫ్ట్ నెంట్ గవర్నర్ (ఉప రాజ్యపాల్) వినయ్ కుమార్ సక్సేనా ఆమోదించారు. అంతేకాదు ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.
అంతేకాదు కొత్త అసెంబ్లీని పునరిద్దరిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆతిషి కొనసాగనున్నారు. ఈ ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషీ మార్లెనా.. కాల్ కాజీ నియోజకవర్గం నుంచి తన సమీప బీజేపీ అభ్యర్ధి రమేశ్ బిదూరి
పై దాదాపు 3521 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున పోటీ చేసిన ఆ పార్టీ ఛీప్ అరవింద్ కేజ్రీవాల్ న్యూ ఢిల్ల అసెంబ్లీ సీటు నుంచి తన సమీప భారతీయ జనతా పార్టీ అభ్యర్ధి పర్వేష్ వర్మ చేతిలో దారుణంగా ఓడిపోయారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ మరో కీలక నేత మనీష్ సిసోడియాతో పాటు సత్యేంద్ర జైన్ సహా పలువురు కీలక నేతలు ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీలో ఆతిషీ ప్రతిపక్ష నేతగా వ్యవహరించనున్నారు. ఇక అవినీతిలో కూరుకుపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ .. ఇపుడు బీజేపీ చేసే అరాచకాలుతో పాటు అవినీతిని అసెంబ్లీలో నిలదీస్తానని చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.