Ration Cards: ప్రజలకు భారీ శుభవార్త.. మీ సేవలో రేషన్‌ కార్డు దరఖాస్తులు

Telangana Ration Cards Apply In Mee Seva: సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న రేషన్‌ కార్డు జారీకి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌ వేదికగా మీ సేవల్లో రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 7, 2025, 09:19 PM IST
Ration Cards: ప్రజలకు భారీ శుభవార్త.. మీ సేవలో రేషన్‌ కార్డు దరఖాస్తులు

Telangana Ration Cards: తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రేషన్‌ కార్డుల ప్రక్రియ ప్రారంభమైంది. రేషన్‌ కార్డుల కోసం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. మీ సేవల్లో రేషన్‌ కార్డు దరఖాస్తులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కొత్త రేషన్‌ కార్డులు కావాలంటే దరఖాస్తు ఎలా చేసుకోవాలో..? ఆ విధానం ఎలానో తెలుసుకోండి.

Also Read: Egg Cooking Method: గుడ్డును మీరు ఉడికించేది శుద్ధ తప్పు.. ఉడికించే విధానం కనిపెట్టిన శాస్త్రవేత్తలు

కొత్త రేషన్‌ కార్డుల కోసం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. లబ్ధిదారుల నుంచి రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని ఈ మేరకు మీ సేవ కమిషనర్‌ను పౌరసరఫరాల శాఖ విజ్ఞప్తి చేసింది. కొన్నేళ్లుగా రేషన్‌ కార్డుల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా కూడా.. ప్రజావాణిల్లోనూ అత్యధికంగా రేషన్‌ కార్డు కోసం దరఖాస్తులు వచ్చాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన 14 నెలల్లోనే 10 లక్షల రేషన్‌ కార్డు కోసం విజ్ఞప్తులు వచ్చాయి. 

Also Read: Anirudh Reddy: తిరుగుబాటు ఎమ్మెల్యే సంచలనం.. 'బిర్యానీ, మటన్‌ కర్రీ తిని వచ్చాం.. అంతే!'

ప్రజల నుంచి భారీ డిమాండ్‌ నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రేషన్‌ కార్డుల జారీకి ఆదేశాలు ఇచ్చింది. మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రేషన్‌ కార్డు దరఖాస్తులకు ఏర్పాట్లు చేయాలని మీ సేవ కమిషనర్‌ను పౌర సరఫరాల శాఖ ఆదేశించింది. రేషన్‌ కార్డులకు సంబంధించిన డేటా బేస్‌ను మీ సేవతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే ప్రజల నుంచి భారీ డిమాండ్‌ ఏర్పడడంతో ఇప్పటికే ప్రభుత్వం కొందరికి రేషన్‌ కార్డులు అందించింది. 

వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో రేషన్‌ కార్డులకు దరఖాస్తులు అందించిన వారు మళ్లీ మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రేషన్‌ కార్డుకు ఎక్కడా దరఖాస్తు చేసుకోనివారు మాత్రమే మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా ఇప్పటికే రేషన్‌ కార్డుల మంజూరుకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటికి అనుగుణంగా దరఖాస్తుదారులు తమ దరఖాస్తులు సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. అయితే మీ సేవా కేంద్రాల్లో ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి? అనే అంశాన్ని ప్రభుత్వం స్పష్టం చేయలేదు. త్వరలోనే దరఖాస్తుకు తేదీలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News