Vivo X200 Pro Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో(Vivo) త్వరలోనే అద్భుతమైన శుభవార్త అందించబోతోంది. అద్భుతమైన ఫీచర్స్‌తో వివో ఎక్స్200 ప్రోను విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా విడుదలకు ముందే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్, లాంచ్ తేది సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ వివో ఎక్స్200 ప్రో (Vivo X200 Pro) స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ నెక్ట్ వీక్‌లో అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిని కంపెనీ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌తో పాటు రిటైల్ స్టోర్స్‌లో అందుబాటులోకి తీసుకు రానుంది. వివో ఎక్స్200 ప్రో (Vivo X200 Pro) స్మార్ట్‌ఫోన్ విడుదలకు సంబంధించిన అధికారిక తేదిని ఇంకా ప్రకటించలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ మొబైల్‌కి సంబంధించిన ధర, ఫీచర్స్ వైరల్ అవుతున్నాయి. దీని ధర రూ.94,999తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ శక్తివంతమైన వివో ఎక్స్200 ప్రో స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌తో విడుదల కానుంది. ముఖ్యంగా మల్టీ టాస్కింగ్ చేసేవారికి ఈ స్మార్ట్‌ఫోన్ చాలా బాగా పని చేస్తుంది. అలాగే ఇందులో వీవో రెండు రోజుల పాటు బ్యాటరీని సామర్థ్యాన్ని అందించేందుకు 6,000mAh బ్యాటరీని కూడా అందిస్తోంది.
Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో హైలెంట్ ఏంటంటే.. దీని కెమెరా అని చెప్పొచ్చు. ఇది అద్భుతమైన కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా 200MP ప్రధాన కెమెరాతో ZEISS APO టెలిఫోటో సెన్సార్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇది AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ను వివో కంపెనీ అద్భుతమైన డిజైన్‌తో అందుబాటులోకి తీసుకు వస్తోంది. అంతేకాకుండా ఇది టాప్-క్లాస్ హార్డ్‌వేర్‌ను కూడా కలిగి ఉండబోతోంది. ఈ మొబైల్ మార్కెట్లోకి విడుదలైతే ప్రముఖ బ్రాండ్స్ అయిన శామ్సంగ్, యాపిల్ మొబైల్స్‌పై పోటీ పడే ఛాన్స్ ఉంది.
Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి