Viral Video: వావ్.. అత్యంత అరుదైన తెల్లని జింక.. ఒక్కసారి చూస్తే సుడి తిరిగిపోతుందంట.. వీడియో వైరల్..

White colour deer: తెల్లని జింక కెమెరాకు చిక్కింది. దాదాపు లక్ష జింకలలో ఒకటి మాత్రమే ఈ విధంగా తెల్లగా ఉంటుందంట. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Feb 4, 2025, 05:24 PM IST
  • కెమెరాకి చిక్కిన తెల్లని జింక..
  • ఆశ్చర్యానికి గురౌతున్న నెటిజన్లు..
Viral Video: వావ్.. అత్యంత అరుదైన తెల్లని జింక.. ఒక్కసారి చూస్తే సుడి తిరిగిపోతుందంట.. వీడియో వైరల్..

White colour deer video viral: సాధారణంగా మనం అడవిలో రకరకాల జంతువుల్ని తరచుగా చూస్తుంటాం. వీటిలో కొన్ని క్రూర జంతువులతో పాటు, మరికొన్ని సాధు జంతువులు కూడా ఉంటాయి. అడవిలో సింహాలు,పులులు, చిరుతలు, ఏనుగులు ఉంటాయి. అదే విధంగా అడవి దున్నలు, జింకలు, మొసళ్లు కూడా ఉంటాయి. అయితే.. జంతువులు కొన్నిసార్లు ఎక్కువగా వైవిధ్యతను చూపిస్తుంటాయి.

వీటి రంగు, ఆకారం మొదలైనవి భిన్నంగా ఉంటాయి. ప్రస్తుతం ఒక తెల్లని జింక సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. సాధారణంగా జింకలనగానే.. ఎక్కువగా అవి గోధుమ వర్ణంలో ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం అది తెల్లగా ఉంది. దాదాపు.. లక్ష జింకలలో  ఒకటి మాత్రమే ఈ విధంగా తెల్లగా ఉంటుందని జువాలజిస్టులు చెబుతుంటారు. వీటిని అల్బినో జింకలు అని కూడా పిలుస్తుంటారంట.

 

ఈ క్రమంలో ప్రస్తుతం ఒక ఆల్బినో తెల్లని జింక కెమెరాకు చిక్కింది. అది మంచు ప్రాంతంలో ఉంది. ఇది ఎక్కడ చిక్కిందో వివరాలు లేవు. కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది.

Read more: Viral Video: బాప్ రే.. జేసీబీని ఎత్తి దూరంగా విసిరేసిన ఏనుగు.. షాకింగ్ వీడియో వైరల్..

గతంలో కూడా  కర్ణాటకలోని కాబిని అడవిలో 2023లో పాటిల్ అనే వ్యక్తి కెమెరాకు తెల్లని జింక చిక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరల తెల్లని జింక మరోసారి కెమెరాలకు చిక్కడం వార్తలలో నిలిచింది. అయితే.. ఈ శ్వేత వర్ణపు జింకను చూడటం లక్ అని, మంచి జరుగుతుందని చాలా మంది చెప్తుకుంటున్నారు. మొత్తానికి అత్యంత అరుదైన తెల్లని జింక వీడియో ప్రస్తుతం వార్తలలో నిలిచింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News