Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ లో ముసలం.. ఎమ్మెల్యేల తిరుగుబాటుకు కారణాలు ఇవే..

Telangana Congress: తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి 10 యేళ్ల తర్వాత అధికారం  కట్టబెట్టారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ తప్పిదాలతో పాటు బీజేపీ చేసిన మిస్టేక్స్ కాంగ్రెస్ కు అయాచిత వరంగా మారాయి. దాన్ని రేవంత్ సరైన క్రమంలో పెట్టి ప్రజల్లో వెళ్లి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. తీరా ప్రభుత్వం ఏర్పడి యేడాది గడవక ముందే అపుడే కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలనే ముసలం పుట్టింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 2, 2025, 07:37 AM IST
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ లో ముసలం.. ఎమ్మెల్యేల తిరుగుబాటుకు కారణాలు ఇవే..

Telangana Congress: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ తో పాటు దేశాన్ని సుధీర్ఘ కాలం పాలించిన  పార్టీగా కాంగ్రెస్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లోనే డైరెక్ట్  అధికారంలో ఉంది. అందులో తెలంగాణ ఒకటి. మరోవైపు తమిళనాడు, జార్ఖండ్, జమ్మూ కశ్మీర్  వంటి రాష్ట్రాల్లో భాగస్వామ్య పక్షంగా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఓ నానుడి ఉంది. దాన్ని ఓడించడానికి ప్రతిపక్షాలు అవసరం లేదు. వాళ్ల పార్టీని ఆ పార్టీలోని మరో గ్రూపు ఓడిస్తుందనేది రాజకీయాల్లో తరుచు చెప్పే మాట. రాజశేఖర్ రెడ్డి సమయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇలాంటి గ్రూపు రాజకీయాలు లేకుండా సాగిపోయింది. అపుడు కూడా పి.జనార్ధన్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి వంటి వాళ్లు కాంగ్రెస్ పార్టీలో వైయస్ వ్యతిరేక వర్గం ముద్ర పడ్డారు. తాజాగా 2023లో  రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాకా.. గ్రూపు రాజకీయాలు కొనసాగకుండా చేశారు. కానీ తీరా ఇపుడు మరోసారి కాంగ్రెస్ పార్టీ గ్రూపు రాజకీయాలు బట్ట బయలయ్యాయి.

తాజాగా తెలంగాణలో 11మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రహస్య భేటీ సంచలనంగా మారింది. అంతేకాదు అధికార పార్టీలో ఈ అంశం తీవ్ర దుమారం రేపుతోంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఈ భేటీ వెనుక కీలకపాత్ర పోషించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల తీరుకు వ్యతిరేకంగానే ఈ సమావేశం జరిగినట్లు సమాచారం. ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఎమ్మెల్యేలు గుస్సాగా ఉన్నారని తెలుస్తోంది. అయితే 11 మంది ఎమ్మెల్యేల సమావేశం వెనుక ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్‌ మంత్రి  కోమటి రెడ్డి హస్తం ఉందన్న వార్తలు వస్తున్నాయి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సదరు మంత్రికి ముఖ్య అనుచరుడు కావడంతో అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించిన అనిరుధ్ రెడ్డి త్వరలోనే మీడియా ముందుకు వస్తారని తెలుస్తోంది.మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ తమ అధికార సోషల్ మీడియాలో ప్రజల పాలన కావాలా..  రాష్ట్రంలో ఫామ్‌హౌజ్‌ పాలన కావాలా...   అంటూ ఓ పోల్‌ నిర్వహించారు. ఈ పోల్‌లో అధికార పార్టీకి నెటిజన్లు దిమ్మతిరిగే మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇచ్చారు.ఇదంత కాంగ్రెస్ పార్టీలో రేవంత్ పెత్తనాన్ని తట్టుకోలేని కొంత మంది కాంగ్రెస్ నేతలు చేసిన పనిగా చెబుతున్నారు.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ఇక కాంగ్రెస్ పార్టీలో కొంత మంద ఎమ్మెల్యేల రమస్య భేటి నేతృత్వంలో  సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రహస్య భేటీ నేపథ్యంలో సీఎం హస్తిన పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. పదకొండు మంది ఎమ్మెల్యేల రహస్య భేటీపై అధిష్టానంతో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలపైనా ఫోకస్‌ పెట్టనున్నారు. మరోవైపు ఢిల్లీ శాసన సభ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News