Union Budget 2025: వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. యథావిధిగా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తూనే ఉత్తరాది రాష్ట్రాలకు ఇతోధికంగా నిధులు కేటాయించింది. ఎన్డీఏ సర్కార్ లో కీలక పాత్ర పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్ కు భారీ కేటాయింపులు గతంలో మాదిరిగానే దక్షిణ భారతదేశానికి అతైసరు కేటాయింపులే జరిగాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క చెప్పుకోదగ్గ నిధుల కేటాయింపు జరగలేదు. మరోసారి తెలంగాణపై పూర్తిస్థాయి నిర్లక్ష్యం జరిగింది. గతేడాది కేటాయింపుల్లో మాదిరిగానే ఈ ఏడాది అదే ఒరవడి ఈసారి కూడా కొనసాగింది. పద్మ అవార్డుల్లో వివక్ష కొనసాగగా తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లోనూ అదే పరిస్థితి కొనసాగింది.
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన కేటాయింపులు చెప్పుకోవడానికి ఏమీ లేదు. బడ్జెట్ ను చూసి రాజకీయ పక్షాలతో పాటు తెలంగాణ ప్రజలు పెదవి విరిచారు. ఒక జిల్లాకు.. ఒక పథకంలో కూడా తెలంగాణకు ప్రాధాన్యం దక్కలేదు. ఒకవిధంగా చెప్పాలంటే కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పేరు అనేదే వినిపించలేదు. అంతగా తెలంగాణపై కేంద్ర వివక్ష కొనసాగింది. గతంలో సీఎం కేసీఆర్ కూడా ఇదే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా అదే ధోరణి కొనసాగుతోంది. తాజాగా కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఏ విషయంలోనూ బడ్జెట్ లో తెలంగాణ పేరు ప్రస్తావనకు రాలేదు.
పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు అపారంగా నిధులు.. ప్రాజెక్టులు లభించగా తెలంగాణ అనే పేరు కనుమరుగైంది. ఈ అంశంపై రాజకీయ పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తుండగా.. ప్రజలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా బడ్జెట్ లో తెలంగాణకు దక్కిన ఫలితాలు ఏమిటో కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఆయన ఏవేవో లెక్కలు తీసి చివరకు రూ.పది వేల కోట్ల కేటాయింపులు చేసినట్లు కవరింగ్ చేశారు. కానీ ఆయన చెప్పిన లెక్కలన్నీ యథావిధిగా రాష్ట్రానికి దక్కాల్సిందే. ఆయన చెప్పిన లెక్కలు న్యాయపరంగా తెలంగాణకు రావాల్సినవి మినహా ప్రత్యేకంగా కేటాయించినవి కావు. ఇక కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ నుంచి ఉన్న మరో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ నామమాత్రం కూడా స్పందించలేదు.
రాష్ట్రం నుంచి ఉన్న 8 మంది బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి కాకుండా వారి పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా కేటాయింపులు చేసుకోలేదు. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో 8 మంది ఎంపీలు కూడా వారి నియోజకవర్గాలకు కూడా నిధులు మంజూరు చేయించుకోలేదు. ఇక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ కేంద్ర బడ్జెట్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, మరో మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిస్తోందని.. ఇక కొత్తగా ఈ ఏడాది కూడా అదే కొనసాగిందని మాజీ మంత్రులు చెప్పుకొచ్చారు. మోదీతో 'పెద్దన్న'గా చెప్పుకుంటూ సన్నిహితంగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సాధించినది ఏమిటని ఇరువురు నాయకులు ప్రశ్నిస్తున్నారు.
Also Read: Union Budget 2025 Tax Slabs: ఆదాయం 12 లక్షలు దాటినా లాభమే, ఎవరికకెంత ఆదా అవుతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook