Karthika Deepam 2 Today January 1st Episode: మరోవైపు శౌర్య పడుకోను అని మారం చేస్తుంది. మంచం లేదు, దోమలు ఉన్నాయి అని బాధపడుతుంది. అప్పుడు దీప అంతకు ముందు ఊర్లో ఉండేవాళ్లం చాపపై పడుకున్నాం అప్పుడేమైంది అంటుంది. అప్పుడు కార్తీక్ మేడపైకి తీసుకెళ్లి చూడు ఇక్కడ ఎంత చల్లాగా ఉంది చూశావా? అంటాడు. అవును నాన్న చల్లగా గాలి వీస్తుంది అంటుంది. నక్షత్రాలు, చందమామను చూపిస్తాడు కార్తీక్ ఎంతో అందంగా ఉంది అంటుంది శౌర్య. ఇంత అందమైన ఆకాశం, చుక్కలు ఈ ఇంటి దగ్గర ఉన్నాయి అంటే ఈ ఇల్లు మనింటికంటే చాలా స్పెషల్ అంటాడు. సరే నాన్న అంటుంది శౌర్య. అయితే, అమ్మ దగ్గర ఎప్పుడూ ఈ ఇంటి గురించి కంప్లైంట్ చేయవు కదా.. అంటాడు. ఓకే చెప్పి శౌర్య వెళ్లిపోతుంది. పిల్లలుక ఏదైనా అలవాటు అయితే, అదే కావాలంటారు. వారికి మనం తప్ప ఎవరు చెబుతారు అంటాడు కార్తీక్.
మరోవైపు పారిజాతం మీ నాన్న దాసును సలహా అడుగుదామా? అంటుంది. దీంతో ఒక్కసారిగా అరుస్తుంది జో. పిలిస్తే తిడతావు మరి కాలు ఎందుకు పట్టుకుంటావు అంటుంది పారు. నువ్వు కాలు పట్టుకోవడం చూశా అంటుంది. అడిగేతి నిన్నే మాట్లాడవే వాడి మాటంటే మండిపడే నువ్వు వాడి కాలు ఎందుకు పట్టుకున్నావ్. చెబుతావా? నా కొడుక్కి ఫోన్ చేసి అడగమంటావా? అంటుంది. ఏదీ లేనిది వాడి కాళ్లు ఎందుకు పట్టుకున్నాడు అంటుంది. నన్ను నాన్న అని పిలవమన్నాడు లేకపోతే సుమిత్ర వదినకు చెబుతా అన్నాడు అందుకే కాళ్లు పట్టుకున్న అని అబద్దం చెబుతుంది జో.ఇది అబద్దం చెబుతుంది అనుకుంటుంది పారిజాతం.
మరోవైపు రాత్రి దీప టిఫిన్ బండీని కవర్ చేస్తుంది. సాయం చేస్తా అని కార్తీక్ వస్తాడు. లక్ష్యం గురించి మాట్లాడుకుంటారు. నీలా బతకడంలో ఒక ఆనందం ఉంది దీప అంటాడు. మీరు అనుకున్నది సాధిస్తారు కార్తీక్ బాబు అంటుంది దీప. నీలా ధైర్యం చెప్పి వెన్నుతట్టి ముందుకు నడిపిస్తే నిప్పుల మీద కూడా నడవచ్చు అంటాడు కార్తీక్. ఈ టిఫిన్ బండీ కూడా మన ఫ్యామిలీ మెంబర్ అయింది అంటాడు కార్తీక్.
ఇదీ చదవండి: నందగోపాల్‌తో కలిసి అనామిక మాస్టర్ ప్లాన్.. ఇంటికి వచ్చాక కావ్య సంగతి తేలుస్తా అని ఎదురు చూస్తున్న ధాన్యం..
కారులో తనతోపాటు ఆఫీసుకు వస్తా అంటుంది పారిజాతం. దాసుకు సంబంధించిన ఏదో విషయం దాస్తున్నావు అదేంటో చెప్పు జో అంటుంది. అప్పుడే తాతా.. అని పిలుస్తుంది. ఒక్కసారి నువ్వు ఇలా రా... అంటుంది. శివన్నారాయణ వస్తాడు.. గ్రానీ కూడా నాతోపాటు ఆఫీసుకు వస్తా అని కారు ఎక్కి కూర్చుంది అంటుంది జో.ఏ మేడం గారు తమరెందుకు ఆఫీసుకు అంటాడు.. సరదాగా వస్తా అంటుంది. ఇంట్లో ఉంటే దాని బుర్రపాడు చేస్తున్నావని సీఈఓ పోస్ట్ ఇచ్చి అక్కడ కూర్చోబెట్టింది అక్కడికి కూడా తయారయ్యావా? అంటాడు. దీంతో కారు దిగి వెళ్లిపోతుంది పారు. నీ కూతురికి పెళ్లి అయ్యే వరకు వీళ్లిద్దరి మధ్య ఓ కంటకనిపెడుతూ ఉండండి అని చెబుతాడు తాతయ్య.
ఇప్పుడేందుకు జో తో ఆఫీసుకు వెళ్తుంది అంటాడు దశరథ. నా కూతురు విషయంలో పిన్ని ఎందుకు ఇంత కేర్ తీసుకోవాలి అని ఆలోచిస్తాడు. మరోవైపు టిఫిన్ బండీ వద్ద గిరాకీ పెరుగుతుంది. ఓ రౌడీ టిఫిన్ బండీ వద్దకు వచ్చి ఇడ్లీ వేడి లేదు, బజ్జీ వేడి లేదు అని గొడవ చేస్తాడు. ఇంతలో బండీ వద్దకు ఓ పిల్ల వస్తుంది. ఆ రౌడీ దీపను పూరీ తీసుకురా, చట్నీ నీళ్లలా ఉంది ఏంటి అని సతాయింపు ఎక్కువ చేస్తాడు. దీంతో కార్తీక్‌కు కోపం వస్తుంది. బండి వద్దకు వచ్చిన ఆ పిల్లను దీప గమనిస్తుంది.
ఇదీ చదవండి: కేంద్రం న్యూ ఇయర్ గిఫ్ట్.. భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర..
ఆ పాప దగ్గరకు వెళ్తుంది దీప. పాప.. ఆకలేస్తుందా? అంటుంది. రా టిఫిన్ పెడతా అంటుంది దీప. నా దగ్గర డబ్బులు లేవు, ఆకలిగా ఉంది అంటుంది. నీ దగ్గర డబ్బులు లేకున్నా నేను పెడతా ఎంతకావాలంటే అంత తిను అంటుంది. అయితే పొట్లం కట్టి ఇవ్వండి ఇంటికి వెళ్లి తింటా.. మా నాన్న తాగుబోతు నన్ను మా అమ్మను వదిలేసి వెళ్లిపోయాడు. పొట్లం కట్టిస్తే నేను మా అమ్మ తింటాం ఇస్తారా? అంటుంది పాప. దీప బాధతో ఆ పాపకు టిఫిన్ కట్టి తెచ్చి ఇస్తుంది. తీసుకెళ్లి మీ అమ్మ నువ్వు కలిసి తినండి అంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.