Cabbage Health Facts In Telugu: చాలామంది క్యాబేజీ, క్యాలీఫ్లవర్ తినేందుకు అంతగా ఇష్టపడరు. కానీ బయట దేశాల్లో మాత్రం వీటినే ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారు. ఎందుకంటే ఇందులో శరీరానికి కావలసిన అనేక రకాల పోషకాలు, యాంటీ యాక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వారంలో ఒక రోజైనా వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో రకాల లాభాలు కలుపుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా క్యాబేజీని ఆహారంలో తీసుకోవడం వల్ల బోలెడు ప్రయోజనాలు పొందుతారు. ఇందులో అనేక శక్తివంతమైన మూలకాలు లభిస్తాయి. కాబట్టి రోజు దీనిని సలాడ్స్‌లా తీసుకోవడం వల్ల విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాలను నయం చేసేందుకు కూడా సహాయపడతాయి. క్యాబేజీని తినడం వల్ల ఇవే కాకుండా శరీరానికి కలిగే ఇతరు లాభాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
క్యాబేజీ తినడం వల్ల కలిగే లాభాలు:
రోగ నిరోధక శక్తి:
క్యాబేజీలో విటమిన్ సి ఎక్కువ మోతాదులో లభిస్తుంది. కాబట్టి రోజు క్యాబేజీ సలాడ్స్ లోకి తీసుకుంటే రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. దీనివల్ల చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లు కూడా రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా వారంలో ఒకటి నుంచి రెండుసార్లు అయినా క్యాబేజీ తినడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు.
జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది:
క్యాబేజీ డైలీ తినడం వల్ల జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్యాబేజీలో ఉండే ఫైబర్ జీర్ణ క్రియను ఆరోగ్యవంతంగా చేసి మలబద్ధకాన్ని నివారించేందుకు కీలకపాత్ర పోషిస్తుంది. దీనివల్ల ప్రేగు కదలికలు కూడా మెరుగుపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే దీనివల్ల ఇతర పొట్ట సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
శరీర బరువును నియంత్రించేందుకు:
క్యాబేజీ రోజు తినడం వల్ల శరీరానికి తక్కువ కేలరీలు, ఫైబర్ ఎక్కువ మోతాదులో లభిస్తుంది. ఇది శరీర బరువును నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా శరీరానికి తగినంత ఫైబర్ లభించి.. యాక్టివ్ గా ఉండేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ముఖ్యంగా పొట్టను నిండుగా ఉంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గుండె సమస్యలకు చెక్:
క్యాబేజీలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రోజు తినడం వల్ల రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుందని.. దీని కారణంగా గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటికే గుండె సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు క్యాబేజీని తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఇందులో ఉండే గుణాలు శరీరంలోని కొలెస్ట్రాలను నియంత్రించేందుకు కూడా సహాయపడతాయి. దీంతోపాటు దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా శరీరాన్ని రక్షిస్తాయి.
క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తాయి:
క్యాబేజీలో సల్ఫోరాఫేన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో లభిస్తాయి. కాబట్టి దీనిని సలాడ్లా తయారు చేసుకుని తినడం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదల క్రమంగా తగ్గిపోతుంది. అంతేకాకుండా ఆ కణాలను నిరోధించేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి. దీనివల్ల పెద్ద పెద్ద క్యాన్సర్లు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం ప్రతిరోజు క్యాబేజీని తినడం వల్ల క్యాన్సర్లే కాకుండా ఇతర ప్రమాదకరమైన రోగాలు కూడా తగ్గాయని అందులో తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.