Karthika Masam Rituals: పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీకం. ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైన కార్తీక మాసం నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమైంది. శివ భక్తులు నిత్యం శివనామస్మరణలో స్మరిస్తుంటారు. ముఖ్యంగా సోమవారం అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఆధ్యాత్మికంగా ఎంతో పరమ పవిత్రమైన కార్తీకంలో అన్ని పర్వదినాలే ఉన్నాయి. కార్తీకంలో వచ్చే ఏకాదశి, పౌర్ణమి చాలా ముఖ్యమైనవి. వాటితో కార్తీక మాసంలో రోజులు ఎలా ఉన్నాయి? శివుడిని ఎలా ఆరాధించాలో వంటివి తెలుసుకుందాం.
Also Read: Telangana Tourism: కార్తీక మాసం బంపర్ టూర్ ప్లాన్.. నల్లమల్ల-కృష్ణమ్మ ఒడిలో లాంచీ ప్రయాణం
కార్తీక మాసంలో సోమవారానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. మొత్తం నాలుగు సోమవారాలు వచ్చాయి. ఆయా రోజుల్లో శైవాలయాలను సందర్శించి ఇష్టమైన పూజలు చేస్తారు. అభిషేకాలు.. అర్చనలు చేసి శివుడిని పూజించిన అనంతరం కోరికలు కోరతారు. కొందరు భక్తులు కార్తీక మాస దీక్షలు కూడా చేస్తుంటారు. నియమ నిష్టతో ఉంటూ నిత్యం పరమాత్ముడిని స్మరిస్తూ ఉంటారు. కార్తీక మాసం చివరి రోజు వీరి దీక్ష ముగుస్తుంది. కొందరు కార్తీక మాసం సందర్భంగా ప్రతి సోమవారం ఉపవాస దీక్షలు కూడా ఉంటుంటారు. ఉపవాసాలు లేకున్నా పర్లేదు కానీ ఈ నెలలో ప్రతి సోమవారం శివాలయాన్ని దర్శించుకోవాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ఇక ఈ కార్తీక మాసంలో ఏమే విశిష్టతలు ఉన్నాయో తెలుసుకుందాం.
Also Read: Aghori: అఘోరీని ఇంట్లోకి రానివ్వని కుటుంబీకులు.. నగ్నంగా వస్తే ఎలా రానిస్తాం?
కార్తీకమాసం విశేషాలు
- నవంబర్ 2వ తేదీ స్థిరవారం నుంచి కార్తీక మాసం ప్రారంభం
- 3వ తేదీ ఆదివారం యమ విధియ - భగినీహస్త భోజనం
- 4 మొదటి కార్తీక సోమవారం. ఇది చాలా పవిత్రమైన రోజు. ఇవ్వాళ తప్పనిసరిగా శివాలయాన్ని సందర్శిస్తారు.
- 5వ తేదీ మంగళవారం నాగుల చవితి. శివుడికి కంఠాభరణంగా ఉన్న సర్పదేవుడిని పూజించుకోవడం చాలా ముఖ్యమైనది.
- 11వ తేదీ రెండో కార్తీక సోమవారం. శైవ క్షేత్రాలను దర్శించుకోవాలి.
- 12వ తేదీ మంగళవారం ఏకాదశి
- 13వ తేదీ బుధవారం క్షీరాబ్ది ద్వాదశి దీపాలు
- 15వ తేదీ శుక్రవారం - కార్తీకపూర్ణిమ. కార్తీకమాసంలోనే అత్యంత పరమ పవిత్రమైన రోజు ఇది. ఈ మాసంలో కార్తీక పౌర్ణమి ఒక్కరోజు శివాలయాన్నికి వెళ్లినా చాలు పరమేశ్వరుడి కటాక్షం లభిస్తుందనే నమ్మకం ఉంది.
- 18వ తేదీ మూడో సోమవారం. శివాలయాన్ని సందర్శించాలి.
- 25వ తేదీ నాలుగో సోమవారం. పరమశివుడి సేవలో మునగాలి.
- 26వ తేదీ బహుళ ఏకాదశి
- 29వ తేదీ మాస శివరాత్రి
- డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కార్తీక అమావాస్య
- డిసెంబర్ 2వ తేదీ సోమవారం మార్గశిర శుద్ధ పాడ్యమి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి