Palak Pakoda: పోషకాల పకోడీ రెసిపీ.. రుచితో పాటు బోలెడు లాభాలు!

Palak Pakoda Recipe: పాలకూర పకోడీని అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఇందులో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు దీనిని స్నాక్‌గా తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Oct 7, 2024, 05:34 PM IST
Palak Pakoda: పోషకాల పకోడీ రెసిపీ.. రుచితో పాటు బోలెడు లాభాలు!

 

Palak Pakoda Recipe: వర్షం పడిందంటే చాలు పకోడీ స్నాక్‌ గుర్తుకస్తాయి. పకోడీలను చిన్న నుంచి పెద్దవారి వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో పకోడీలను వివిధ రకాల కూరగాలతో తయారు చేస్తారు. కొంతమంది వీటిని ఆకు కూరలతో కూడా తయారు చేస్తారు. ముఖ్యంగా చాలా మంది ఎక్కువగా పాలకూరతో తయారు చేసిన పకోడీని తింటూ ఉంటారు. దీనిని తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి అనేక రకాల విటమిన్స్‌ను అందిస్తాయి. మీరు కూడా ఎప్పటి నుంచో పాలకూర పకోడీని ఇంట్లోనే ఎలాంటి శ్రమ లేకుండా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా తయారు చేసుకోండి.

పాలకూర పకోడీకి కావలసిన పదార్థాలు:
పాలకూర - 1 కట్ట (కడిగి, చిన్న చిన్న ముక్కలుగా కోసి, నీరు పిండి వేయాలి)
శనగ పిండి - 1 కప్పు
కారం పొడి - 1/2 టీస్పూన్
నీరు - అవసరమైనంత
నూనె - డీప్ ఫ్రై చేయడానికి
కొత్తిమీర - కొద్దిగా (చిన్నగా తరిగిన)
ఉప్పు - రుచికి తగినంత
బియ్యం పిండి - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1/2 టీస్పూన్
జీలకర్ర - 1/4 టీస్పూన

తయారీ విధానం:
✪ ఈ పాలకూర పకోడీని తయారు చేయడానికి ముందుగా ఒక పాత్ర తీసుకోవాల్సి ఉంటుంది. అందులో శనగ పిండి, ఆవాలు, జీలకర్ర, కారం పొడి, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 

✪ అలాగే ఓ బౌల్‌లో పాలకూరను వేసుకుని.. అందులోనే అవసరమైనంత పిండిని కలుపుకుని బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 

✪ ఇలా కలుపుకున్న పిండి మరీ గట్టిగా.. పలుచగా లేకుంగా చూసుకోవాల్సి ఉంటుంది.

✪ ఇక కడాయిలో నూనెను వేసుకుని బాగా వేడి చేసుకోవాల్సి ఉంటుంది. అందులో పకోడీలను వేసుకుని రెండువైపులా బాగా కల్చుకోవాల్సి ఉంటుంది. 

✪ ఇలా వేయించిన పకోడీలను  రుచి కోసం పెరుగు లేదా టమాటో సాస్‌తో సర్వ్ చేసుకోండి.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

చిట్కాలు:
✪ ఈ పకోడీనికి తయారు చేసుకునే క్రమంలో పాలకూరను బాగా నీరు పిండి వేయడం ఎంతో ముఖ్యం. లేకపోతే పకోడీలు ముద్దగా ఉంటాయి.
✪ పిండిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపితే పకోడీలు మరింత పెద్దగా, పొంగి వస్తాయి.
✪ పకోడీలను వేయించేటప్పుడు నూనె మరీ ఎక్కువగా వేడిగా ఉండకుండా చూస్తే చాలా బాగుంటుంది.
✪ పకోడీలను వేయించేటప్పుడు తప్పకుండా నిమిషానికి ఒక సారి అటూ ఇటూ కలుపూ ఉండాలి.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News