TSPSC Group 1 Notification Canceled: తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇది వరకు పేపర్ లీకేజీ అయ్యిందని, ప్రమాణాలు పాటించలేదని గ్రూప్ వన్ పలుమార్లు రద్దయిన విషయం తెలిసిందే. దీంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. ఎన్నో సంవత్సరాలు,ఇంట్లో వాళ్లను వదిలేసి, పగలనక, రాత్రనక కష్టపడి చదివి రాసిన ఎగ్జామ్ తీరా కమిషన్ తప్పిదాల వల్ల ఇలా క్యాన్షిల్ కావడం పట్ల నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read More: Sreemukhi: వాలుజడతో కవ్విస్తోన్న శ్రీముఖి.. బిగ్‌బాస్ బ్యూటీ యవ్వారం మాములుగా లేవుగా.
తాజాగా, తెలంగాణాలో అధికారంలోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ ను సమూలంగా ప్రక్షాళన చేశారు. దీనిలో భాగంగా టీఎస్పీఎస్సీకి చైర్మన్ , సభ్యులను నియమించారు. అదే విధంగా గత నోటిఫికేషన్ కు గ్రూప్ వన్ కు మరిన్ని పోస్టులు యాడ్ చేశారు. సుప్రీంకోర్టులో గత బీఆర్ఎస్ వేసిన పిటిషన్ ను కూడా ఉపసంహరించుకున్నారు.
ఇదిలా ఉండగా .. సోమవారం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కు గత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేస్తున్నట్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా.. తాజాగా యాడ్ చేసిన పోస్టులను కలిపి త్వరలోనే 563 కొత్త పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదలకు సన్నాహలు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ వర్గాలు తెలిపాయి. నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా ప్రిపరేషన్ ను నిరంతరం కొనసాగించాలని సీఎం రేవంత్ సూచించారు.
Read More: Kajjikayalu Recipe: కజ్జికాయలను చేయడం ఎంతో ఈజీ.. మీరు కూడా ట్రై చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook