AP Rajyasabha Elections: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే జరగనున్న రాజ్యసభ ఎన్నికలు కీలకంగా మారాయి. ప్రతిపక్షం తెలుగుదేశానికి అవకాశం లేకుండా చేసేందుకు వైఎస్ జగన్ వ్యూహం మొదలెట్టారు. స్పీకర్ ద్వారా ప్రతిపక్షానికి ఝలక్ ఇచ్చారు. అసలేం జరిగిందంటే..
ఏపీ అసెంబ్లీ స్పీకర్ హఠాత్తుగా ప్రతిపక్షానికి చెక్ పెట్టే నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ ఎన్నికల వేళ తెలుగుదేశానికి అవకాశం లేకుండా చేసేందుకు చకచకా నిర్ణయాలు తీసుకున్నారు. ఎప్పుడో స్టీల్ ప్లాంట్ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా శ్రీనివాస్ రాజీనామాను ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం హఠాత్తుగా ఆమోదించారు. అంతేకాకుండా టీడీపీ నుంచి వైసీపీలో నలుగురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేశ్, మద్దాలి గిరిధర్‌లకు అటు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆనం రాంనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, జనసేన నుంచి వైసీపీలో చేరిన రాపాక వరప్రసాద్‌లకు నోటీసులు ఇచ్చారు.
తమ పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే టీడీపీ, జనసేనలు స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఫిర్యాదు చేసి ఉన్నాయి. ఈ ఫిర్యాదును ఇప్పుడు పరిగణలో తీసుకున్న స్పీకర్ తమ్మినేని సీతారాం మొత్తం 9 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా సంతృప్తికర సమాధానం ఇవ్వాలని కోరారు. లేకపోతే అనర్హత వేటు తప్పదని హెచ్చరించారు. అందులో కొందరు నెలరోజుల సమయం అడిగినా స్పీకర్ మాత్రం వారం రోజులే వ్యవధి ఇచ్చారు.
త్వరలో అంటే మార్చ్ మొదటి వారంలో ఏపీకు చెందిన మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ మూడింటినీ కైవసం చేసుకునేందుకు వైసీపీకు తగిన బలమున్నా..గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో జరిగింది రిపీట్ కాకుండా ఉండేందుకు వైసీపీ జాగ్రత్త పడుతోంది. ఇప్పటికే గంటా రాజీనామా ఆమోదించారు. ఇక వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు చెక్ పెట్టేందుకు స్పీకర్ వద్ద తగిన ఆధారం కూడా ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ నలుగురు విప్ ధిక్కరించారు. ఆ ఒక్క అంశం కారణంగా నలుగురిపై వేటు వేయవచ్చు. అదే సమయంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నలుగురిపై కూడా వేటు వేసినా వైసీపీకు వచ్చే నష్టమేదీ లేదు. అందుకే టీడీపీ బలం తగ్గించేందుకు స్పీకర్ తమ్మినేని సీతారాం హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also read: Jio Prepaid plans: 84 రోజుల వ్యాలిడిటీతో అత్యధిక డేటా ఇచ్చే బెస్ట్ ప్లాన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook