Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాని పక్కన పెట్టేసిన డైరెక్టర్ హరీష్ శంకర్.. ఎందుకో తెలుసా

Ustaad Bhagath Singh: ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా గురించి ప్రకటించి చాలా కాలం గడిచింది కానీ సినిమా షూటింగ్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. తాజా సమాచారం ప్రకారం హరీష్ శంకర్ ఇప్పుడు ఈ సినిమాని కొన్నాళ్ళ పాటు పక్కన పెట్టేసి వేరే సినిమాల గురించి ఆలోచించాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2023, 12:12 PM IST
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాని పక్కన పెట్టేసిన డైరెక్టర్ హరీష్ శంకర్.. ఎందుకో తెలుసా

Harish Shankar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మొదటి సినిమా గబ్బర్ సింగ్. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఆఖరి సినిమా గద్దలకొండ గణేష్. ఈ సినిమా విడుదల అయ్యి నాలుగేళ్లు అవుతుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో తన సినిమా అయినా త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలని అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ అటు సినిమాలు మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉంటూ ఈ సినిమా షూటింగ్ కోసం సమయం కేటాయించలేకపోయారు. దీంతో సినిమా షూటింగ్ కూడా ఇంకా పూర్తి కాలేదు. అందుకే హరీష్ శంకర్ ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ తో సినిమా గురించి ఎదురు చూస్తూ ఉండిపోయిన హరీష్ శంకర్ ఇప్పుడు వేరే సినిమా మీద దృష్టి పెట్టడం మంచిదని నిర్ణయించుకున్నారట. పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా తర్వాత హరీష్ శంకర్ తో సినిమా క్యాన్సిల్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నట్లు వార్తలు వినిపించాయి. 

పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాని పూర్తి చేస్తానని హామీ ఇచ్చి రెండు షూటింగ్ షెడ్యూల్స్ కూడా పూర్తి చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ ల సమయం దగ్గరికి రావడంతో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. ఈ సినిమా షూటింగ్ మళ్లీ సెట్స్ పైకి వెళ్ళడానికి కనీసం 6 నుంచి 7 నెలల సమయం పడుతుంది.

అందుకే హరీష్ శంకర్ ఈ గ్యాప్ లో మరొక సినిమా షూటింగ్ పూర్తి చేయాలని అప్పటిదాకా ఈ సినిమా గురించి పక్కన పెట్టేయాలని నిర్ణయించుకున్నారట. కేవలం పవన్ కళ్యాణ్ సినిమా అనే పట్టుకొని ఇలా నెలల సమయం వేస్ట్ చేయడం హరీష్ శంకర్ కి కూడా అంత మంచిది కాదు. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ తీసుకున్న నిర్ణయం మంచిదే అని అందరూ కామెంట్లు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Also read: Chandrababu Bail Conditions: చంద్రబాబు బెయిల్‌కు అదనపు షరతులు వర్తిస్తాయి

Also read: Delhi Air Pollution: వాయు కాలుష్యం అంతకుమించి.. ఈ నెల 10వ తేదీ వరకు స్కూల్స్‌కు సెలవులు

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link- https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link- https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x