Lunar Eclipse October 2023: ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణ అక్టోబర్ 28వ తేదీన సంభవించబోతోంది. ఈ చంద్రగ్రహణం అక్టోబర్ 28వ తేదీ రాత్రి 11 గంటలకు ప్రారంభమై.. అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించక పోయిన సూతకాల ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ఇదే సమయంలో కొన్ని గ్రహాలు సంచారం చేశాయి..కాబట్టి గ్రహ సంచారాల ప్రభావం, చంద్రగ్రహణ ప్రభావం మొత్తం 12 రాశుల వారిపై వ్యక్తిగత జీవితాలపై ప్రభావం పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఈ రాశుల వారిపై చంద్రగ్రహణ ప్రభావం:
మేషరాశి:
మేష రాశి వారికి ఈ సమయంలో తల్లిదండ్రులతో విభేదాలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో వీరు పోటీ పరీక్షల్లో సులభంగా విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలహాలను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ సమయంలో మనస్సు చంచలంగా ఉంటుంది. అంతేకాకుండా మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో ఆర్థిక సంక్షోభం కారణంగా అనేక రకాల సమస్యలు వస్తాయి.
మిధున రాశి:
చంద్రగ్రహణం కారణంగా మిధున రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితులు కూడా సులభంగా మెరుగుపడతాయి. అంతేకాకుండా అధికారుల నుంచి మద్దతు లభించి ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు.
కర్కాటక రాశి:
ఈ సమయంలో కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. అంతేకాకుండా సన్నిహిత సంబంధాలలో కూడా అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. చంద్రగ్రహణ సమయంలో స్వీయ నియంత్రణలో ఉండడం చాలా మంచిది.
సింహరాశి:
సింహ రాశి వారికి కూడా ఈ సమయంలో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. వీరికి ఆత్మవిశ్వాసం తగ్గడమే కాకుండా, కుటుంబంలో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వీరు మాతృత్వ ఆనందాన్ని పొందే ఛాన్స్ లు కూడా ఉంది.
కన్యా రాశి:
కన్యా రాశి వారు ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలి. భూ వివాదాలకు సంబంధించి కోర్టులకు తిరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి:
మకర రాశి వారు కూడా ఈ సమయంలో స్వీయ నియంత్రణలో ఉండాలి. లేకపోతే అనేక రకాల మానసిక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఈ సమయంలో స్నేహితులు భాగస్వాముల మధ్య కూడా గొడవలు రావచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.