Ajwain Remedies: శరీరంలో అన్ని సమస్యలకు కారణం అదేనా, వాము నీటితో ఆ సమస్యకు చెక్ చెప్పేయవచ్చా

Ajwain Remedies: మనిషి శరీరంలో అంతర్గతంగా జరిగే లోపాలు లేదా సమస్యలు వివిధ రూపాల్లో బయటపడుతుంటాయి. అన్ని సమస్యలకు మూల కారణం మెటబోలిజం. అంటే జీవక్రియ. జీవక్రియ సరిగ్గా లేకుంటే అన్నీ ఇబ్బందులే. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 16, 2023, 12:23 PM IST
 Ajwain Remedies: శరీరంలో అన్ని సమస్యలకు కారణం అదేనా, వాము నీటితో ఆ సమస్యకు చెక్ చెప్పేయవచ్చా

Ajwain Remedies: మనిషి ఆరోగ్యం అనేది శరీరంలోని మెటబోలిజం ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. మెటబోలిజం బాగున్నంతవరకూ ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు. జీవక్రియ బాగుండాలంటే ఏం చేయాలనేదే అసలు ప్రశ్న. జీవక్రియ అనేది సహజంగానే ఆహారపు అలవాట్లు, జీవనశైలిని బట్టి ఉంటుంది. 

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆధుునిక జీవన విధానపు పోకడలతో ఆహారపు అలవాట్లే మారిపోతున్న పరిస్థితి ఉంది. అందుకే తరచూ పలు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడంతో శరీరం జీవక్రియపై ప్రభావం చూపిస్తోంది. మెటబోలిజం మందగించడంతో వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే సకల రోగాలకు కారణం జీవక్రియ లేదా మెటబాలిజం మందగించడమే. జీవక్రియ మెరుగ్గా ఉంటే ఏ రోగాలు అంత సులభంగా దరిచేరవు. 

శరీరంలో మెటబోలిజంను మెరుగుపర్చేందుకు వాము లేదా అజ్వైన్ వాటర్ అద్భుతంగా పనిచేస్తుందని వివిధ ఆయుర్వేద వైద్య విధానాలు అనాదిగా చెబుతున్నాయి. రోజూ వాము నీరు తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. జీర్ణవ్యవస్థ బాగుంటే కడుపు నొప్పి, గ్యాస్, మలబద్ధకం, ఎసిడిటీ వంటి చాలా రకాల సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు. వాముతో ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. బరువు తగ్గించుకునేందుకు వాము నీరు చాలా బాగా ఉపయోగడుతుంది. అందుకే వెయిట్ లాస్ ప్రోగ్రాంలో కచ్చితంగా వాము నీరు రోజు తాగమని సూచిస్తుంటారు. 

వాము నీటిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలెక్కువ. ఇందులో పుష్కలంగా ఉండే ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్, నికోటిన్ యాసిడ్, కార్పొహైడ్రేట్లు, డైటరీ ఫైబర్‌లు ఆరోగ్యానికి చాలా మంచిది. వామునీరు క్రమం తప్పకుండా తీసుకుంటే..గొంతు నొప్పి,నోటి నుంచి దుర్వాసన సమస్యతో బాధపడేవారికి ఉపశమనం కలుగుతుంది. ప్రతి రోజూ ఉదయం పరగడుపున వాము నీటిని తీసుకుంటే అద్బుతమైన ఫలితాలుంటాయి. 

ఇక అన్నింటికంటే ముఖ్యమైంది మహిళలు నెలసరి సమయంలో ఎదుర్కొనే ఇబ్బందులు. పీరియడ్స్ సమయంలో మహిళలకు భరించలేని కడుపు నొప్పి సమస్య ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వాము నీటిని తాగితే మంచి ఫలితాలుంటాయి.

Also read: Cholesterol Tips: కొలెస్ట్రాల్ అధికంగా ఉందా, మీ జీవనశైలిలో ఈ చిన్న చిన్న మార్పులు చేసి చూడండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News