Aghori baba angry on youtuber video viral: ఉత్తర ప్రదేశ్ లో జరుగుతున్న కుంభమేళకు లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఈ రోజు పుష్య పౌర్ణమి నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున మొదటి షాహీ స్నానానికి పొటెత్తారు. దాదాపు.. 60 లక్షల పుణ్య స్నానాలు చేశారని సమాచారం. ఇదిలా ఉండగా.. ప్రయాగ్ రాజ్ కుంభమేళలో పుణ్య స్నానాదులు చేసేందుకు దేశంలో ఉన్న అఘోరీలు, నాగ సాధువులు, అఖాడాల సన్యాసీలు భారీ ఎత్తున తరలి వస్తున్నారు.
మహా కుంభమేళకు వస్తున్న భక్తులకు ఇబ్బందులు కల్గకుండా యోగి సర్కారు పటిష్టమైన చర్యలు తీసుకుంది. ఇదిలా ఉండగా.. కుంభమేళలో వెరైటీగా అఘోరీలు కన్పిస్తున్నారు. దీంతో భక్తులు వారి ఆశీర్వాదాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
क्या एक साधु सन्त की ऐसी भाषा होती है?? दरअसल ज्यादातर साधु सन्त असामाजिक तत्व ही होते हैं।।#kumbh2025 pic.twitter.com/eTt9Mt8Mmj
— Inderjeet Barak🌾 (@inderjeetbarak) January 13, 2025
ఇక మరోవైపు యూట్యూబర్ లు.. అఘోరీల వ్యక్తిగత విషయాలను గురించి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక యూట్యూబర్ కు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఈ వీడియో ప్రస్తుతం వార్తలలో నిలిచింది..
కుంభమేళలో ఒక అఘోరీ బాబా దగ్గరకు యూట్యూబర్ వెళ్లాడు. అతను మీరు బాబాగా ఎలా మారారు. మీరు ఏవిధంగా పూజలు చేస్తారు.. అదేవిధంగా మంత్రాలు ఏవిధంగా జపిస్తారు.. అంటూ అనేక ప్రశ్నలడిగాడు. దీంతో శివాలెత్తిపోయి సదరు అఘోరీ బాబా రెచ్చిపోయాడు.
Read more: Kumbha Mela 2025: కనుల పండువగా కుంభమేళా ప్రారంభం.. కేవలం రూ.1296 కే హెలిక్యాప్టర్ బుక్ చేసుకోవచ్చు..
తన దగ్గరున్న కమండలం, మరో కర్రతో యూట్యూబర్ ను చావబాదాడు. దీంతో యూట్యూబర్ అక్కడి నుంచి పారిపోయి.. బాబా దెబ్బల నుంచి తప్పించుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు. ఆ బాబా వేలి గోర్లు చాలా పెద్దగా ఉన్నాయి. చూస్తుంటే.. అది ఏదో బొంగరాలు మాదిరిగా తిరిగిపోయాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter