Chhotu baba from assam video goes viral: ఉత్తర ప్రదేశ్ లో యోగి సర్కారు కుంభమేళను ఎంతో వేడుకగా నిర్వహిస్తుంది. ఎక్కడ కూడా కుంభమేళకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కల్గకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ ఎత్తున సాధువులు, సంత్ లు తరలివస్తున్నారు. అయితే.. ప్రస్తుతం కుంభమేళ నేపథ్యంలో ఒక అస్సాంకు చెందిన గంగ పురి మహారాజ్ (ఛోటు బాబా) వార్తలలో నిలిచారు.ఆయన గత 32 ఏళ్లుగా ఒక్కసారి కూడా స్నానం చేయలేదంట.
అదే విధంగా ప్రస్తుతం ఆయనకు 57 ఏళ్ల వయసు అని తెలుస్తొంది. అదే విధంగా ఎత్తు 3.8 అడుగులు. అయితే.. ఈ ఛోటు బాబా ఒక నియమం అనుకుని స్నానం చేయకుండా... అలానే ఉండిపోయారంట. అది నెరవేరితేకానీ.. స్నానం చేయనని మంకు పట్టు పట్టారంట. ప్రస్తుతం ఛోటు మహారాజ్ తాను .. అనుకున్నది నెరవేరితే.. క్షిప్ర నదిలో మాత్రమే స్నానం చేస్తానని వ్రతం పట్టుకున్నారంట.
కుంభమేళ నేపథ్యంలో అక్కడికి వస్తున్న భక్తులు ఈ ఛోటు బాబాతో ఫోటో లు దిగేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తొంది. అయితే.. ఈ ఛోటు బాబా మాత్రం.. మిగిలిన సాధువుల్లా గుంపులుగా ఇతరులతో ఉండేందుకు ఆసక్తి చూపించడంలేదని తెలుస్తొంది.
Read more: Maha Kumbh Mela 2025: మహాకుంభమేళాకు ముస్తాబవుతున్న అయోధ్య..హోటళ్లు ఫుల్..పువ్వులకు ఫుల్ డిమాండ్
ఆయన ఏకాంతంగా ఉంటూ.. శివుడి గురించి ధ్యానిస్తు ఉంటారంట. అదే విధంగా ఎత్తు అనేది అంత ముఖ్యంకాదని.. కూడా ఆయన చెప్పారంట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. మరీ ఆయన ఇక్కడ కుంభమేళలో మాత్రం స్నానం చేయరంట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter