New Income Tax Act Updates in Telugu: ఇన్‌కంటాక్స్ కొత్త చట్టం వచ్చింది. ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. ట్యాక్స్ స్లాబ్స్ మార్పులతో ట్యాక్స్ పేయర్లకు ఉపశమనం కల్గించిన కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను శాఖ చట్టంతో కఠినతరం కూడా చేసింది. ఇకపై ట్యాక్స్ పేయర్లు సెక్షన్ 80 మినహాయింపు పొందలేరా, కొత్త చట్టం ఏం చెబుతోంది.
కొత్త ఇన్‌కంటాక్స్ బిల్లును ఇటీవలే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 206 నుంచి అమల్లోకి వచ్చాక చాలా మార్పులు రానున్నాయి. ఇప్పటి వరకూ అమల్లో ఉన్న ఇన్‌కంటాక్స్ చట్టం 1961 ఇకపై ఉండదు. ఈ చట్టం పాతదైంది. కొత్త చట్టం ట్యాక్స్ పేయర్లకు సులభతరంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే కొత్త చట్టం అమల్లోకి రాగానే కొన్ని కీలకమైన మార్పులు మొదలవుతాయి. ఈ మార్పులకు ట్యాక్స్ పేయర్లు సిద్ధంగా ఉండాలి. ఇప్పటి వరకూ ఇన్‌కంటాక్స్ చట్టంలోని సెక్షన్ 80సి ఇకపై కన్పించదు. ఇది కొత్త ఇన్‌కంటాక్స్ చట్టంలో క్లాజ్ నెంబర్ 123గా ఉంటుంది. సెక్షన్ 80సి పరిధిలో ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్, పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, నేషనల్ పెన్షన్ సిస్టమ్ వంటి వాటిపై ఏడాదికి 1.5 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు ఉంది.
కొత్త చట్టంలో సెక్షన్ 123 ఏం చెబుతోంది
కొత్త చట్టంలో ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్, పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, నేషనల్ పెన్షన్ సిస్టమ్ వంటి మినహాయింపులు సెక్షన్ 123లో ఉంటాయి. దీని ప్రకారం ఎవరైనా సరే వ్యక్తిగతంగా లేదా హిందూ అవిభక్త కుటుంబానికి చెందిన వ్యక్తి ఏడాదిలో గరిష్టంగా 1.5 లక్షల వరకూ చెల్లించిన మొత్తంపై ట్యాక్స్ మినహాయింపు పొందగలడు. పాత చట్టంలో సెక్షన్ 80సి అంటే ఇకపై కొత్త చట్టంలో సెక్షన్ 123తో సమానం.
ట్యాక్స్ ప్రక్రియను కొత్త ఇన్‌కంటాక్స్ చట్టం 2025 మరింత సులభతరం చేయనుంది. వివిధ రకాల ట్యాక్స్ సెక్షన్లు గతంలో 819 ఉండగా ఇప్పుడు 536కు పరిమితమయ్యాయి. అవసరం లేని ట్యాక్స్ మినహాయింపుల్ని తొలగించారు. అదే విధంగా కొత్త చట్టంలో మొత్తం పదాల సంఖ్య కూడా 5 లక్షల నుంచి 2.5 లక్షలకు తగ్గాయి. అసెస్‌మెంట్ ఇయర్ స్థానంలో ట్యాక్స్ ఇయర్ అని ఉంటుంది. కొత్త చట్టం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ట్యాక్స్ మినహాయింపులు, ట్యాక్స్ స్లాబ్స్‌లో ఎలాంటి మార్పులు ఉండవు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి