Delhi Election 2025 Results: ఢిల్లీలో ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. ఢిల్లీ పీఠం అధిరోహించాలనే బీజేపీ కోరిక 26 ఏళ్ల తరువాత పూర్తయింది. భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్న బీజేపీ విజయాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. ఆప్ అధినేత కేజ్రీవాల్, మరో కీలక నేత సిసోడియా సహా చాలామంది పరాజయం పాలయ్యారు. 2020లో 8 సీట్లకే పరిమితమైన బీజేపీ అధికారం ఎలా సాధించగలిగింది..కారణాలేంటి
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 47 సీట్ల ఆధిక్యంలో కొనసాగుతుంటే ఆప్ 22 సీట్లకు పరిమితమయ్యే పరిస్థితి కన్పిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మరోసారి సున్నాకు డకౌట్ అయింది. 2015లో కేవలం 3 సీట్లే గెలిచిన బీజేపీ ఆ తరువాత 2020లో 8 సీట్లలో విజం సాధించింది. రెండు సార్లు అధికారం కోసం ప్రయత్నించి విఫలమైంది. కానీ ఈసారి 2025లో 47 సీట్లతో భారీ విజయం దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయానికి కారణమయ్యే అంశాల కంటే ఆప్ పరాజయానికి దారితీసిన కారణాలే అధికంగా ఉన్నాయి. సంక్షేమ పధకాల ప్రకటన కంటే ఆప్ వైఫల్యాలే బీజేపీ విజయానికి కారణాలుగా ఉన్నాయి. బీజేపీ ప్రకటించిన ఉచిత హామీలు కొద్దిగా ప్రజల్ని ఆకట్టుకున్నాయి. దాంతోపాటూ ఇటీవల బడ్జెట్‌లో ప్రకటించిన ఇన్‌కంటాక్స్ స్లాబ్ మార్పు ప్రధాన కారణంగా తెలుస్తోంది. 12.75 లక్షల ఆదాయం వరకూ జీరో ట్యాక్స్ విధానం ప్రకటించడంలో ఉద్యోగవర్గాల్లో ప్రభావం చూపించిందని తెలుస్తోంది. ఎందుకంటే డిల్లీ ఓటర్లలో ఉద్యోగుల సంఖ్య చాలా ఎక్కువ.
ఆప్ వైఫల్యాలు, కేజ్రీవాల్ అతి విశ్వాసం
బీజేపీ విజయానికి దారితీసిన ప్రదాన అంశాల్లో ఆ పార్టీ అవలంభించిన వ్యూహం కంటే ఆప్ వైఫల్యాలు, స్వయం కృతాపరాధాలే ఎక్కువగా ఉన్నాయి. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఇతర నేతలు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లు అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లడం పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశాయి. పార్టీలో నెలకున్న అంతర్గత కలహాలు మరో కారణం. ముఖ్యంగా కైలాష్ గెహ్లాట్, రాజ్ కుమార్ ఆనంద్ వంటి నేతల రాజీనామాలు పార్టీకి నష్టం చేకూర్చాయి. భారీగా నమోదైన కొత్త ఓటర్లు, మహిళలు ఆమ్ ఆద్మీ పార్టీకు దూరమయ్యారు.
ఎన్నికల వ్యూహాలు అమలు చేయడంలో అరవింద్ కేజ్రీవాల్ విఫలమయ్యారు. అతి విశ్వాసం కొంపముంచింది. కలిసి పోటీ చేయకపోతే ఓట్లు చీలుతాయనే కనీస అవగాహన లేకపోయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవకపోయినా చాలా నియోజకవర్గాల్లో ఆప్ ఓట్లకు గండి కొట్టింది. ఎందుకంటే దాదాపు 15-20 నియోజకవర్గాల్లో ఆప్ అభ్యర్ధులు 1000-2000 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసే ప్రసక్తి లేదని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించడం అతి పెద్ద తప్పిదంగా తెలుస్తోంది. ఈ విషయంలో కేజ్రీవాల్ అతి విశ్వాసమే కొంప ముంచినట్టు తెలుస్తోంది.
ఇక అన్ని వరుసగా 12 ఏళ్లు పాలించడంతో సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడుతుంది. ప్రజలు మార్పు కోరుకోవడం సహజం. ఈ అంశాన్ని కేజ్రీవాల్ అంచనా వేయలేకపోయారు. మొత్తానికి కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టు ఆప్ వైఫల్యాలు అన్నీ బీజేపీకు విజయావకాశాలయ్యాయి.
Also read: Delhi Election 2025 Results: ఢిల్లీ ఎన్నికల్లో చంద్రబాబు సూపర్ హిట్, విజయం దిశగా బీజేపీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి