Amit Shah says J&K statehood will be restored after delimitation and polls: జమ్మూ-కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రకటించారు. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని, ఆపై రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని వెల్లడించారు. కశ్మీర్ లోయలో (Kashmir Valley) అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని.. స్థానికంగా శాంతి సామరస్యాలకు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అమిత్ షా (Amit Shah) అన్నారు. కశ్మీర్‌లో నూతన శకం మొదలైందన్నారు. ఉగ్రవాదం, (Terrorism) అవినీతి పాలన, కుటుంబ రాజకీయాల నుంచి శాంతి, అభివృద్ధి, ప్రజా శ్రేయస్సు వైపు అడుగులు పడుతున్నాయని చెప్పారు. 2019 నుంచి స్థానికంగా పారదర్శకమైన, అవినీతి రహిత పాలన సాగుతోందన్నారు. ఆర్టికల్ 370 (Article 370) రద్దు చేయకుండా ఇవన్ని సాధ్యమయ్యేవేనా అని అమిత్ షా ప్రశ్నించారు.
Also Read : Koozhangal Oscar entry: ఆస్కార్ బరిలో నయతారకు కాబోయే భర్త మూవీ
2019లో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణాన్ని రద్దు చేసిన తర్వాత తొలిసారి అమిత్ షా (Amit Shah) కశ్మీర్‌లోయలో పర్యటిస్తున్నారు. కశ్మీర్ లోయలో భద్రతా పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
Also Read : Janhvi Kapoor belly dance : బెల్లీ డ్యాన్స్‌తో అదరగొట్టిన జాన్వీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook