7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం ఇదే డీఏ విషయంలో శుభవార్త అందించింది. మరి కొందరు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు కూడా వర్తించేలా ఆదేశాలు జారీ చేసింది. అంటే 5, 6వ వేతన సంఘాల ప్రకారం ఇప్పటికీ జీతాలు అందుకుంటున్న పబ్లిక్ ఎంటర్‌ప్రైజస్ ఉద్యోగులకు భారీ ప్రయోజనం కలగనుంది.
6వ వేతన సంఘం ప్రకారం పెరిగిన డీఏ, జీతభత్యాలు
కేంద్ర ఆర్ధిక శాఖ ఇటీవల అంటే నవంబర్ 7వ తేదీన ఓ మెమోరాండం జారీ చేసింది. దీని ప్రకారం పబ్లిక్ ఎంటర్‌ప్రైజస్ ఉద్యోగులు ఎవరైతే 5,6 వేతన సంఘాల ప్రకారం జీతాలు అందుకుంటున్నారో వారికి డీఏ పెరిగింది. 6వ వేతన సంఘం ప్రకారం జీతాలు అందుకుంటున్న ఉద్యోగుల డీఏ 239 నుంచి 246 శాతానికి పెరిగింది. ఈ డీఏ పెంపు జూలై నుంచి అమల్లోకి రానుంది. అంటే 6వ వేతన సంఘం ప్రకారం 7 శాతం డీఏ పెరిగింది. అంటే కనీస వేతనం 43 వేలున్న ఓ ఉద్యోగి గతంలో 239 శాతం డీఏ ప్రకారం 1,02,770 రూపాయలు అందుకుంటే ఇప్పుడు కొత్త డీఏ 246 శాతం ప్రకారం 1,05,780 రూపాయలు అందుకోనున్నారు. అంటే నెలకు నేరుగా 3 వేలు పెరిగింది. ఏడాదికి 36 వేల జీతం పెరగనుంది.
5వ వేతన సంఘం ప్రకారం ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ 443 శాతం నుంచి 455 శాతానికి పెరిగింది. ఇది కూడా జూలై 2024 నుంచి వర్తిస్తుంది. అంటే డీఏ నేరుగా 12 శాతం పెరిగింది. అదే 7వ వేతన సంఘం ప్రకారం ఉద్యోగుల డీఏ, పెన్షనర్ల డీఆర్ అనేవి 50 నుంచి 53 శాతానికి అంటే 3 శాతం పెరిగింది. జూలై నుంచి డీఏ లెక్కించి ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్ పెంపు అనేది ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలను తట్టుకునేందుకు ఏడాదికి రెండుసార్లు కేంద్ర ప్రభుత్వం పెంచుతుంటుంది.
Also read: Ys Jagan Challenge: చంద్రబాబును ఓ రేంజ్‌లో ఆడుకున్న జగన్, దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలంటూ సవాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
7th Pay Commission DA Hike: కేంద్రం నుంచి మరో గుడ్ న్యూస్, ఈ ఉద్యోగులకు 12 శాతం డీఏ