World No Tobacco Day 2021: స్మోకింగ్ మానేస్తేనే కరోనా ముప్పును ఎదుర్కోవచ్చు, WHO, ప్రముఖ వైద్య నిపుణుడు

World No Tobacco Day 2021: సిగరెట్ తాగుతుంటే చేతివేళ్లు పెదాలను తాకి తద్వారా కరోనా వైరస్ నోటిలోకి వెళుతుందని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. ఊపిరితిత్తులను దెబ్బతిసే కోవిడ్19 వైరస్ స్మోకింగ్ చేసే వారిలో తీవ్ర ప్రభావం చూపుతుంది.

Written by - Shankar Dukanam | Last Updated : May 30, 2021, 05:30 PM IST
  • ప్రపంచ వ్యాప్తంగా పోగాకు కారణంగా 8 మిలియన్ల మంది చనిపోతున్నారు
  • కరోనా సమయంలో స్మోకింగ్ చేసేవారిలో ముప్పు అధికంగా ఉంటుంది
  • స్మోకింగ్ మానేస్తే ఎన్నో రకాలు ఆరోగ్యంగా ఉంటుందని నిపుణుల సూచన
World No Tobacco Day 2021: స్మోకింగ్ మానేస్తేనే కరోనా ముప్పును ఎదుర్కోవచ్చు, WHO, ప్రముఖ వైద్య నిపుణుడు

World No Tobacco Day 2021 : ధూమపానం అలవాటు ఉన్నవారిలో కరోనా బారిన పడే అవకాశాలు అధికంగా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. సిగరెట్ తాగుతుంటే చేతివేళ్లు పెదాలను తాకి తద్వారా కరోనా వైరస్ నోటిలోకి వెళుతుందని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. ఊపిరితిత్తులను దెబ్బతిసే కోవిడ్19 వైరస్ స్మోకింగ్ చేసే వారిలో తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రతి ఏడాది మే 31న వరల్డ్ నో టోబాకో డే నిర్వహిస్తారు. పోగాకు ఉపయోగం వల్ల దుష్ప్రరిణామాలు, స్మోకింగ్ చేస్తే కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తారు. 

స్మోకింగ్ అలవాటుతో కోవిడ్19 బారిన పడేందుకు అవకాశాలపై హైదరాబాద్ యశోదా హాస్పిటల్‌కు చెందిన వాస్క్యూలర్ కన్సల్టెంట్, ఎండోవాస్క్యూలర్ సర్జన్ డాక్టర్ దేవేందర్ సింగ్ పలు విషయాలు షేర్ చేసుకున్నారు. స్మోకింగ్ అలవాటు ఉన్నవారు కోవిడ్19 (Smoking vs COVID-19) బారిన పడే అవకాశంతో పాటు చనిపోయే ప్రమాదం అధికంగా ఉందని హెచ్చరించారు. ఓ వైపు సరియైన చికిత్స లేదని, మరోవైపు కరోనా సోకితే మొదటగా దాడి చేసే అవయవం ఊపిరితిత్తులేనని తెలిపారు. కరోనా బాధితులలో వైరస్ ప్రభావం అధికంగా ఉన్నవారిలో శ్వాస వ్యవస్థకు అంతరాయం కలుగుతుందన్నారు.

Also Read: 2DG Drug Price: డీఆర్‌డీవో కరోనా మెడిసిన్ 2డీజీ ధర ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

ధూమపానం అలవాటు ఉన్న వారితో పోల్చితే స్మోకింగ్ (Smoking Causes Cancer) అలవాటు లేనివారిలో రికవరీకి అవకాశాలు అధికంగా ఉంటాయని చెప్పారు. ప్రతి ఏడాది పోగాకు ఉత్పత్తుల వాడకం కారణంగా 8 మిలియన్ల మంది ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోతున్నారు. 7 మిలియన్ల మంది నేరుగా సిగరెట్లు తాగడం, పోగాకు ఉత్పత్తులు వాడకంతో ప్రాణాలు కోల్పోగా, స్మోకింగ్ చేసే వారి పక్కన ఉండే మిలియన్ మంది సైతం ఈ సంబంధిత అనారోగ్యం తలెత్తి చనిపోతున్నారు. ధూమపానం అలవాటు ఉన్నవారిలో కరోనా ప్రభావం అధికంగా ఉంటుందని, ప్రాణాలు సైతం వీరిలోనే త్వరగా పోతాయని డాక్టర్ అభిప్రాయపడ్డారు. 

Also Read: Blood Cancer Types: బ్లడ్ క్యాన్సర్ రకాలు, అందుకు కారణాలివే, చికిత్స పూర్తి వివరాలు

మధుమేహం, కార్డియో వాస్క్యూలర్ ఇన్‌ఫెక్షన్, మాలిగ్నెన్సీ, శ్వాసకోస సమస్యలు ఉన్నవారు త్వరగా కోవిడ్19 బారిన పడతారు. పోగాకు ఉత్పత్తులు వాడకం, స్మోకింగ్ చేయడం మానేస్తే కనీసం రెండు వారాల నుంచి ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉంటుందన్నారు. ప్రభుత్వం సైతం ఈ అలవాటుకు దూరంగా ఉండాలని ప్రకటనలు ఇస్తుంది. ప్రతి ఏడాది నో టొబాకో డే సందర్భంగా స్మోకింగ్ అలవాటు మాన్పించేందుకు అవగాహనా కార్యక్రమాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు స్మోకింగ్ మానేయాలని భావిస్తున్నారట. 

Also Read: Health Tips: మామిడి పండు తిన్నాక ఈ పదార్థాలు తినకూడదు, నిర్లక్ష్యానికి మూల్యం తప్పదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News