Laila rating: తారాగణం: విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ, కమాక్షి భాస్కర్ల, అభిమన్యు సింగ్, బబ్లు పృథ్వీరాజ్, సునీషిత్ తదితరులు
దర్శకుడు: రామ్ నారాయణ్
నిర్మాత: సాహు గరపాటి
బ్యానర్: షైన్ స్క్రీన్స్
సంగీతం: లియోన్ జేమ్స్
విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘మెకానిక్ రాకీ’ వంటి వరుస అపజయాల తర్వాత ‘లైలా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వహించగా, షైన్ స్క్రీన్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
కథ ఏమిటి?
సోను మోడల్ (విశ్వక్ సేన్) హైదరాబాద్ పాతబస్తీలో ఓ బ్యూటీ పార్లర్ నడుపుతుంటాడు. అతని మేకప్ స్కిల్స్‌కి అక్కడ మంచి పేరు ఉంటుంది. ఒక కస్టమర్ కుటుంబానికి సహాయం చేయాలనే ఉద్దేశంతో, ఆమె భర్త నడిపే వంటనూనె వ్యాపారం బ్రాండ్ అంబాసిడర్‌గా తన పేరు వినిపించమని చెప్తాడు. కానీ ఈ చిన్న నిర్ణయం సోనును ఓ పెద్ద చిక్కులో పడేస్తుంది. పరిస్థితుల ప్రభావంతో ‘సోను’ ఎలా ‘లైలా’గా మారాల్సి వచ్చింది? అతను మహిళగా మారిన తర్వాత ఏం జరిగింది? అన్నదే మిగిలిన కథ.
నటినటుల పర్ఫామెన్స్:
విశ్వక్ సేన్ మహిళ వేషధారణలో కనిపించడం కొత్తగా అనిపించినా, పాత్రలో పెద్దగా నటనావకాశం లేకపోవడం వల్ల.. అతని అభిమానులను కొద్దిగా నిరాశ పరుస్తుంది. కానీ విశ్వక్ మాత్రం 100కి 100% న్యాయం చేశారు. ఈ సినిమాకి ఏదైనా పెద్ద పాజిటివ్ ఉంది అంటే అది విశ్వక్ నటన. ఆకాంక్ష శర్మ గ్లామర్ షో.. తప్ప చెప్పుకునేంత నటన ప్రదర్శించే అవకాశం లేదు అంత. అభిమన్యు సింగ్ పాత్ర పెద్దదే అయినప్పటికీ, అతను కొన్ని సన్నివేశాల్లో నవ్వులు పుట్టించాడు. బబ్లు పృథ్వీరాజ్, వినీత్ కుమార్ లాంటి పాత్రలు చిరాకు తెప్పించేలా ఉన్నాయి. కమాక్షి భాస్కర్లకు ఓ మంచి పాత్ర దక్కినప్పటికీ, ఆమె నటన సాధారణంగానే ఉంది. సోషియల్ మీడియా సెన్సేషన్ సునీషిత్ తన నిజ జీవితం పాత్రనే పోషించాడు కానీ, దాన్ని వినోదాత్మకంగా మార్చడం డైరెక్టర్‌కి సాధ్యపడలేదు. మొత్తం పైన అన్ని పాత్రలు కూడా సగం సగం గానే మిగిలిపోయాయి.
సాంకేతిక అంశాలు
లియోన్ జేమ్స్ సంగీతం విఫలమైంది. ‘ఇచ్చుకుందాం బేబీ’ పాట మిగిలిన వాటితో పోలిస్తే కొద్దిగా మెరుగ్గా అనిపించినప్పటికీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏమాత్రం ప్రభావం చూపలేదు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. సాగర్ దాడి ఎడిటింగ్ పనితీరు పరవాలేదు.ఈ సినిమాలో అసలు సమస్య రచయిత వాసుదేవ మూర్తి, దర్శకుడు రామ్ నారాయణ్. ఎందుకంటే కథ, దర్శకత్వం రెండు పాతగానే ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నప్పటికీ, కంటెంట్ నాసిరకంగా ఉండడంతో అవి ఎంతమాత్రం ఉపయోగపడలేదు.
హైలైట్స్:
-విశ్వక్ నటన
- కొన్ని కామెడీ సన్నివేశాలు
- నిర్మాణ విలువలు
లోపాలు:
- పాతకథనం
- సాగదీత.
-పాటలు
విశ్లేషణ:
విశ్వక్ సేన్ తన కెరీర్ ప్రారంభంలో ‘హిట్’, ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ లాంటి సినిమాలతో తనను మంచి నటుడిగా నిరూపించుకున్నాడు. కానీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘మెకానిక్ రాకీ’ లాంటి కమర్షియల్ ఫార్ములాతో ప్రయోగాలు చేయడమనే తపన అతనికి వెనకడుగు వేసేలా చేసింది. ‘లైలా’ కూడా అదే కోవకు చెందిన సినిమా. కానీ పైన చెప్పిన అన్ని సినిమాలలో కూడా విశ్వక్ నటన ఏ చిత్రంలోను నిరాశపరచలేదు. లైలాలో కూడా అంతే. అతని ఎనర్జీ వల్ల పరమ రొటీన్ కథ కూడా పరవాలేదు అనిపించుకుంది.
సినిమా ఆరంభం నుంచే పాతబస్తీ హాస్యాన్ని, ద్వందార్థ సంభాషణలను ప్రధానంగా మలచడం, కథేమీ లేకుండా అర్థరహిత సన్నివేశాలు నింపడం సినిమాను ఆసక్తికరం కానీయకుండా చేసింది. హీరో-హీరోయిన్ మధ్య రొమాంటిక్ ట్రాక్ అసలు పనిచేయలేదు. అలాగే, క్లైమాక్స్ పూర్తిగా నిరాశపరిచింది. మొదటి హాఫ్ పర్వాలేదు అనిపించుకున్న సెకండ్ హాఫ్ మాత్రం సాగదీసిన అనిపిస్తుంది.
మొత్తంగా, ఓ మోస్తరు తొలి భాగం, చాలా బోరింగ్ రెండో భాగంతో ‘లైలా’ సినిమా ఈ వారాంతరం యావరేజ్ సినిమా గా మిగలనుండి.
తీర్పు: లైలా – నిరాశ పరిచిన ప్రయోగంలో మెరిసిన విశ్వక్ సేన్!
రేటింగ్: 2/5
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.