తనకు ఓ నటితో వివాహం జరిగిందని, కానీ ఆమె చెప్పిన కారణంగా ఈ విషయాన్ని ఎక్కడా బహిర్గతం చేయలేదని అంటున్నాడు ఓ హోటల్ యజమాని. ఆపై తన భార్య మరో నటుడితో ప్రేయాయణం కొనసాగిస్తోందని వాపోయాడు. ఆ వివరాలిలా ఉన్నాయి.. బుల్లితెర నటి పవిత్ర పునియా తన భార్య అని తెలిపాడు ఓ హోటల్ ఓనర్ సుమిత్ మహేశ్వరి.
బాలీవుడ్ టీవీ నటి పవిత్ర పునియా ‘లవ్ యు జిందగీ’తో కెరీర్ ఆరంభించింది. ఆ తరువాత పలు సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా మారింది. ఈ క్రమంలో సుమిత్ మహేశ్వరితో నటి పవిత్ర పునియాకు నిశ్చితార్థం జరిగింది. తనతో వివాహం సైతం జరిగినా.. కేవలం ఎంగేజ్‌మెంట్‌తో కథ ముగిసిందని ఆమె పలుమార్లు చెప్పినట్లు గుర్తుచేశాడు. అయితే తనతో వివాహం (Actress Pavitra Punia is Married) కూడా జరిగిందని, ప్రస్తుతం తన భార్య పవిత్ర పునియా మరో నటుడ్ని సైతం మోసం చేస్తుందని ఆరోపించాడు సుమిత్ మహేశ్వరి.
ఆమె చెప్పిన కారణంగా పెళ్లి విషయాన్ని ఇప్పటివరకూ బహిర్గతం చేయలేదని, కానీ తనను మోసం చేసి పవిత్ర పునియా వేరొకరితో ప్రేయాయణం కొనసాగిస్తుందని ఆరోపించాడు. పెళ్లి అయిన విషయాన్ని దాచిపెట్టి నటుడు పరాస్ ఛబ్రాను ప్రేమించిందని వెల్లడించాడు. వీరి ప్రేమ వ్యవహారం తెలియగానే పరాస్ ఛబ్రాకు మెస్సేజ్ చేసి విషయం తెలిపినట్లు పేర్కొన్నాడు. తనతో పవిత్ర పునియా విడాకులు తీసుకోలేదని, తామిద్దరం ఇప్పటికీ భార్యభర్తలమేనని నటుడు పరాస్‌కు వెల్లడించానని చెప్పాడు.
Also Read : Pooja Bhalekar Photos: RGV హీరోయిన్ పూజా భలేకర్ ఫొటోస్ ట్రెండింగ్
తన చేతిపై పవిత్ర టాటూ కూడా ఉందని తెలిపాడు. తనలో ఏ మార్పు రాలేదని, కానీ పవిత్ర పునియా మాత్రం చాలా మారిపోయిందన్నాడు. తమ పెళ్లిరోజు వేడుకను సెలబ్రేట్ చేసుకున్న గోవాలోని అదే హోటల్‌లో పవిత్ర, పరాస్ ఛబ్రా కలిసి ఉన్నారని తెలియగానే చాలా బాధపడ్డానంటూ వాపోయాడు. మరోవైపు పరాస్ ఛబ్రా సైతం తాను మోసపోయానని భావిస్తున్నాడు. పెళ్లయిన విషయం దాచిపెట్టి తనతో ప్రేయాయణం సాగింంచిన విషయాన్ని నిలదీస్తే ఒప్పుకుందని పరాస్ వెల్లడించాడు.
Also Read : Anushka Sharma Shirshasanam: అనుష్క శర్మ శీర్షాసనం.. నెటిజన్లు ప్రశంసలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Pavitra Punia: ‘ఆ నటి నా భార్య.. కానీ మరో నటుడితో లవ్ అఫైర్‘