Tamil film 'Koozhangal' is India's official entry to the Oscars this year: తమిళ చిత్రం కూళంగల్ (పెబెల్స్) ఆస్కార్ పోటీలకు ఎంపికైంది. 2022లో జరిగే 94వ ఆస్కార్ (Oscar) పోటీలకు మనదేశం తరఫు నుంచి కూళంగల్ మూవీ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఆస్కార్ సెలక్షన్ కమిటీ ఛైర్ పర్సన్ షాజీ ఎన్ కరుణ్ తెలిపారు. ఇక ఈ మూవీని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు (ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఎఫ్ఎఫ్ఐ జనరల్ సెక్రెటరీ సుప్రాన్ సెన్ వెల్లడించారు.
2022 బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరిలో పోటీ పడేందుకు మన భారత దేశం తరుపున అధికారిక ఎంట్రీ కోసం పలు సినిమాలు పోటీ పడ్డాయి. ఆస్కార్ లిస్ట్‌లో కేంద్రం 15 మంది సభ్యులతో ఓ జ్యూరీని ఏర్పాటు చేసింది. ఇందులో మన దేశం నుంచి ఎంపిక చేసిన 14 సినిమాలను చూసి ఫైనల్‌గా ‘కూళంగల్’ మూవీని మన దేశం తరుపున ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరిలో అధికారిక ఎంట్రీగా ఎంపికైంది.
‘కూళంగల్’ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచిందన్న విషయం తెలియగానే ఈ చిత్ర నిర్మాత, నయనతారకు (Nayanthara) కాబోయే భర్త విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) ఫుల్ ఖుషీ అయిపోయాడు. ఆస్కార్ (Oscar)గెలుచుకునేందుకు కేవలం రెండు మెట్ల దూరంలో ఉన్నానంటూ హ్యాపీగా ఫీలయ్యాడు నయనతారకు కాబోయే భర్త విఘ్నేశ్ శివన్.
There’s a chance to hear this!
“And the Oscars goes to …. 🎉🎉🥰🥰🥰🥰 “
Two steps away from a dream come true moment in our lives …. ❤️❤️🥰🥰🥰🥰🥰🥰🥰#Pebbles #Nayanthara @PsVinothraj @thisisysr @AmudhavanKar @Rowdy_Pictures
Can’t be prouder , happier & content 💝 pic.twitter.com/NKteru9CyI
— Vignesh Shivan (@VigneshShivN) October 23, 2021
Also Read : Janhvi Kapoor belly dance : బెల్లీ డ్యాన్స్‌తో అదరగొట్టిన జాన్వీ
దర్శకుడు పీఎస్ వినోత్ రాజ్‌కి (Vinothraj) కూళంగల్ తొలి చిత్రం. అయినప్పటికీ మూవీని ఎంతో బాగా తెరకెక్కించారు. ఆయన కుటుంబంలో జరిగిన ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. కూళంగల్ మూవీ ఇద్దరి తండ్రీకొడుకుల కథ.
తాగుబోతు తండ్రి వేధింపులు భరించలేక తల్లి ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. ఆమెను తిరిగి వెనక్కి ఎలా తీసుకొచ్చారనేదే ఈ సినిమా కథాంశం. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) అందించిన సంగీతం అందించారు. నయనతార, (Nayanthara) నిర్మాత విఘ్నేశ్ శివన్ సంయుక్తంగా ‘రౌడీ పిక్చర్స్’ (Rowdy_Pictures) బ్యానర్‌పై కూళంగల్ మూవీని నిర్మించారు.
ఇప్పటికే ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఎన్నో అవార్డులు దక్కించుకొని విజేతగా నిలిచిందీ చిత్రం. కాగా 2022 మార్చి 22న 94వ అకాడెమీ అవార్డు ప్రదానోత్సవం అమెరికా లాస్ ఏంజిల్స్‌లోని డాల్బి థియేటర్లో (Los Angeles' Dolby Theatre) జరగనుంది.
Also Read : Rajinikanth PeddannaTeaser: రజనీకాంత్ ‘పెద్దన్న’ టీజర్ అదిరింది.. ఫ్యాన్స్‌కు వెంకటేశ్ సర్ప్రైజ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook