Pushpa 2 Exclusive Scenes: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా పుష్ప 2.. భారతీయ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయం రాసింది. బాహుబలి 2, కేజీఎఫ్ 2 వంటి చిత్రాలను మించిన హైప్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా.. థియేటర్లలో వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులను సృష్టించింది. 50 రోజుల రన్‌ను పూర్తి చేసిన పుష్ప 2 ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల కోసం సిద్ధమవుతోంది.
పుష్ప 2 చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ పాన్ ఇండియా భాషల్లో అన్నిటిలో కూడా..హక్కులను సొంతం చేసుకుంది. జనవరి 30, 2025 నుంచి ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి రానుంది అని ప్రకటించారు సినిమా యూనిట్. అయితే, ప్రేక్షకులకు పెద్ద సర్ప్రైజ్‌గా ఈ సినిమా ఓటీటీ వెర్షన్‌లో 3 గంటల 44 నిమిషాల రన్ టైమ్ కలిగి ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. థియేటర్ల వెర్షన్‌లో 3 గంటల 20 నిమిషాల పాటుగా ఉన్న ఈ చిత్రానికి.. అదనంగా 24 నిమిషాల సన్నివేశాలను జోడించారు.
ఇందులో జోడించిన అదనపు 24 నిమిషాల సన్నివేశాలు ఏవన్నీ, వాటి వెనుక ఉన్న కథేమిటి అనే విషయం మాత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ వివరాలు తెలుసుకోవాలంటే జనవరి 30 వరకు ఆగాల్సిందే. మధ్యలో ఈ చిత్రానికి.. పది నిమిషాలు అదనంగా యాడ్ చేసి సంక్రాంతి సందర్భంగా..విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ లెక్కన ఇప్పుడు ఓటీటిలో ఆ వర్షన్ కన్నా కూడా 14 నిమిషాలు మరింత యడ్ చేయడం అందరిని ఆశ్చర్యపరచందమే కాకుండా.. ఆసక్తిగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూసేలా చేస్తోంది.
అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన పుష్ప 2లో దేవిశ్రీ ప్రసాద్, సామ్ సి ఎస్ లు అందించిన సంగీతం ముఖ్య ఆకర్షణగా నిలిచాయి. థియేటర్లలో పుష్ప 2 సూపర్ హిట్ అయ్యి, 1000 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. బాలీవుడ్ సినిమాలు కూడా అందుకోలేని స్థాయిలో ఈ చిత్రం రికార్డులను దాటి వెళ్లింది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిన పుష్ప 2 సినిమా ఓటీటీలో ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని అందించనుంది. ఈ మూవీకి జనరల్ ప్రేక్షకులే కాదు, సినీ విశ్లేషకులు కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. థియేటర్ వెర్షన్‌ను మించిన అనుభూతి కలిగించేలా ఈ సినిమా ఓటీటీలో సిద్ధమవుతోందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
Also Read: Supreme Court: వైఎస్ జగన్‌కు బిగ్ రిలీఫ్ ఆర్ఆర్ఆర్ పిటీషన్ కొట్టివేసిన సుప్రీంకోర్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి