Love story trailer: లవ్ స్టోరీ ట్రైలర్ రిలీజ్ అయింది. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 24న విడుదల కానుంది. విడుదల తేదీ సమీపిస్తున్న తరుణంలో తాజాగా మేకర్స్ లవ్ స్టోరీ ట్రైలర్‌ని ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చారు. పేదరికంతో కొట్టుమిట్టాడుతూనే ఏదో ఒకటి సాధించాలని పరితపించే కొంతమంది నిరుపేద యువతను వెన్నుతట్టి ప్రోత్సహించే సందేశం ఏదో ఇచ్చారని లవ్ స్టోరీ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. గ్రామీణ నేపథ్యం, పేదరికం లాంటివేవి ఆశయానికి అడ్డు రావని చెప్పడమే ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నట్టుగానూ కనిపిస్తోంది.
లవ్ స్టోరీ ట్రైలర్‌లో నాగచైతన్య చెప్పిన ఓ డైలాగ్ ఆడియెన్స్‌ని ఆలోచనలో పడేసింది. '' రిక్షా తొక్కుకునేటోడికి కొత్త రిక్షా కొనిస్తే రిక్షానే తొక్కుకుంటాడు. గొర్లు మేపుకునేవాడికి గొర్లు కొనిస్తే గొర్లనే మేపుకుంటాడు. ఇలా అయితే మేమెలా డెవలప్ అవుతాం సర్'' అని నాగ చైతన్య (Naga Chaitanya) కొట్టిన డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజెన్స్‌ని ఆకర్షిస్తోంది.
Also read : Uttej Wife Padmavati Passed Away: ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట్లో విషాదం..
ఇప్పటికే తెలంగాణ సర్కారుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో ఇది కూడా ఒకటి. గొర్లు, బర్లు ఇస్తూ వాళ్లను అంతకంటే పైకి ఎదగనివ్వకుండా ప్రభుత్వం కుట్ర పన్నుతోందనేది టీఆర్ఎస్ సర్కారుపై ఉన్న ప్రధానమైన ఆరోపణ. అవకాశం చిక్కినప్పుడల్లా ప్రతిపక్షాలు ఇదే అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకునపడేసే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకు తగినట్టుగానే తాజాగా లవ్ స్టోరీ సినిమాలోనూ (Love story movie) ఈ డైలాగ్ పెట్టడం యాదృచ్చికమా లేక ప్రభుత్వంపై పరోక్షంగా వేసిన సెటైరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే లవ్ స్టోరీ సినిమా నుంచి సారంగ దరియా సాంగ్ (Saranga dariya song controversy), నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి నే చిత్తరువైతిరయ్యో సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక నాగచైతన్య సరసన జంటగా నటించిన సాయి పల్లవి గ్లామర్ గురించి చెప్పనక్కరేలేదు. శేఖర్ కమ్ముల గత చిత్రం ఫిదా సినిమాలో లాగే తన మార్కు చూపించుకునే పాత్రలో సాయి పల్లవి (Sai Pallavi) కనిపించనుందని ట్రైలర్ స్పష్టంచేస్తోంది. మొత్తానికి ఇప్పటివరకు లవ్ స్టోరీ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెరిగేలా లవ్ స్టోరీ ట్రైలర్ (Love story trailer) కట్ చేశారు.
Also read : Ram Charan's luxury car : రామ్ చరణ్ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న కారు కంపెనీ, ధర ఎంతో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook