Rangamarthanda Movie Review: రంగ మార్తాండ రివ్యూ.. సినిమా చూస్తూ ఏడవకుండా ఉండలేరు..!

Rangamarthanda Movie Review: కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని రోజులుగా ప్రివ్యూలు పడుతూనే ఉన్నాయి. సెలెబ్రిటీలు సినిమాను చూస్తూనే ఉన్నారు. చిత్రాన్ని గొప్పగా పొగుడుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 22, 2023, 06:44 PM IST
  • నేడే థియేటర్లోకి రంగమార్తాండ
  • కృష్ణ వంశీ మార్క్ మూవీ
  • బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్‌ల నటన
Rangamarthanda Movie Review: రంగ మార్తాండ రివ్యూ.. సినిమా చూస్తూ ఏడవకుండా ఉండలేరు..!

'Rangamarthanda' Movie Review in Telugu కృష్ణవంశీ తీసిన రంగమార్తాండ సినిమా అనేది మరాఠీలో వచ్చిన నటసామ్రాట్ సినిమాకు రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే. అయితే కెరీర్‌లో మొదటి సారిగా రీమేక్‌ చేస్తూ ఉన్న కృష్ణవంశీ ప్రకాష్‌ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ వంటి దిగ్గజాలతో ప్రయోగం చేశాడు. మరి ఈ సినిమా నేడు (మార్చి 22) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది? కథ, కథనాలు, నటీనటుల పర్ఫామెన్స్ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

కథ.. 

రంగమార్తాండ రాఘవరావు (ప్రకాష్ రాజ్) తన రంగస్థల నట ప్రస్థానానికి వీడ్కోలు తీసుకుంటాడు. ఇక ఇంట్లోనూ తన బాధ్యతలు నెరవేరుస్తాడు. తాను సంపాదించిన ఆస్తి తన కొడుకు రంగారావు (ఆదర్శ్), శ్రీ (శివాత్మిక)లకు రాసిచ్చేస్తాడు. హాయిగా, సంతోషంగా రిటైర్మెంట్ జీవితాన్ని గడపాలని అనుకుంటాడు. తన కంటూ ఓ చిల్లిగవ్వ కూడా దాచి పెట్టుకోని రంగారావుకు ఎదురైన పరిస్థితులు ఏంటి? రంగారావు జీవితంలో చక్రధర్ (బ్రహ్మానందం) పాత్ర ఏంటి? రాఘవరావు కోడలు (అనసూయ) కథ ఏంటి? ఎంతో ప్రేమగా భార్యను రాజు గారు (రమ్యకృష్ణ) అంటూ పిలిచే వ్యక్తి ఎలా తోడు నిల్చింది? అసలు రంగారావు ఏ దిక్కూ లేకుండా ఎందుకు అయిపోయాడు? కన్నబిడ్డలకు రంగారావు ఎందుకు దూరం కావాల్సింది? చివరకు రంగారావు ఏం అయ్యాడు? అన్నది కథ.

నటీనటులు..

రంగామార్తాండ సినిమాలో ప్రత్యేకంగా ఈ ఒక్కరి నటన అని చెప్పుకునేందుకు లేదు. ప్రతీ ఒక్కరూ పోటీ పడ్డారు. ఒక్కో సీన్లో ఒక్కొక్కరూ అదరగొట్టేశారు. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందంలు ప్రేక్షకులను ఏడిపించేస్తారు. రమ్యకృష్ణ కొన్ని చోట్ల కంటి చూపుతోనే మాట్లాడిస్తుంది. కదిలిస్తుంది. అలా ఈ ముగ్గరూ ఈ సినిమాను మరోస్థాయిలో నిలబెట్టేశారు. రంగమార్తాండకు ఆ ముగ్గరూ ప్రాణంగా నిలిచారు. నటించారు. ఆ తరువాత చెప్పుకోవాల్సిన పాత్రలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి కోడలి పాత్ర. కోడలి పాత్రలో అనసూయ ఎంతో సహజంగా నటించినట్టుగా అనిపిస్తుంది. రాహుల్, శివాత్మిక, ఆదర్శ్ ఇలా ప్రతీ ఒక్కరూ తమ తమ పాత్రలకు తగ్గట్టుగా చక్కగా నటించారు.

విశ్లేషణ..

రంగమార్తాండ సినిమాలో ఎన్నో గొప్ప విషయాలను చెప్పారు. భాష గొప్పదనాన్ని, పరభాష ప్రభావాన్ని, మాతృ భాష విలువను చూపించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను చూపించారు. అన్నింటి కంటే ముఖ్యంగా అమ్మానాన్నలను ఎలా చూసుకోవాలి.. ఎలా చూసుకోకూడదు అనే విషయాలను గుండెను పించేలా చూపించాడు. తెరపై ఎమోషన్స్‌ను చూపించడంలో కృష్ణవంశీ దిట్ట అని మరోసారి నిరూపించుకున్నాడు. కృష్ణవంశీ సినిమాల్లో ఉండే చిక్కదనం ఇందులోనూ కనిపిస్తుంది. చాలా చోట్ల కృష్ణవంశీ అందరినీ ఏడిపిస్తాడు. కదిలిస్తాడు. ఆలోచింపజేస్తాడు.

ప్రస్తుతం బిడ్డలు ఎలా ప్రవర్తిస్తున్నారు, తల్లిదండ్రులను ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారు? అనేది చూపించాడు. ఇందులో బిడ్డలేమీ చెడ్డవారు కాదు. పరిస్థితులు వారిని అలా మార్చేస్తాయి. ఆ పరిస్థితుల వల్లే మనుషులు మారుతారు అని సహజంగా చూపించాడు. అయితే బిడ్డల కోసం తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారు.. ఆ బిడ్డలు పెరిగిపెద్దై పెళ్లి చేసుకున్నాక అమ్మానాన్నలను ఎలా చూసుకుంటున్నారు?.. అనేది చక్కగా చూపించాడు. ఇక బిడ్డలు పుట్టనందుకు ఎంతో అదృష్ణవంతుడ్ని అంటూ బ్రహ్మానందంతో చెప్పించిన డైలాగ్‌ ఎంతో లోతుగా అనిపిస్తుంది.

ప్రథమార్థంలో కాస్త సరదాగా సినిమా సాగినా.. ద్వితీయార్థం వచ్చే సరికి గుండె బరువెక్కేలా చేస్తాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో అయితే కంటతడి పెట్టాల్సిందే. బ్రహ్మానందం ప్రకాష్‌ రాజ్‌ల మధ్య వచ్చే సీన్లు ఒకెత్తు అయితే.. క్లైమాక్స్‌లో ప్రకాష్‌ రాజ్‌ ఎమోషనల్ సీన్ మరో ఎత్తు. రమ్యకృష్ణ, ప్రకాష్‌ రాజ్, బ్రహ్మానందంల సీన్లను కృష్ణవంశీ మలిచిన తీరు అద్భుతంగా అనిపిస్తుంది. ఇక నటీనటులకు తగ్గట్టుగా, వారి ఎమోషన్స్‌ను ఇళయరాజా తన ఆర్ఆర్‌తో మరోస్థాయికి తీసుకెళ్లాడు. పాటలు వినసొంపుగా ఉన్నాయి. మాటలు ఆలోచింపజేస్తాయి. సినిమాటోగ్రఫీ అందంగా ఉంది. నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి.

రేటింగ్ 3.5

బాటమ్ లైన్: రంగమార్తాండ.. ఉండగలరా కన్నీరు కార్చకుండా..?

Also Read:  Kota Srinivasa Rao : చనిపోయానంటూ వార్తలు.. పోలీసులు వచ్చారు.. కోట శ్రీనివాసరావు వీడియో వైరల్

Also Read: Nani With Anchor Suma: ప్రోమోల కోసం నాని కూడా ఇలా చేస్తున్నాడా?.. అవాక్కైన యాంకర్ సుమ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News