Prakash Raj Satires: పవన్ ఓ మూర్ఖుడు, విధ్వంస రాజకీయాలు చేస్తున్నాడు

Prakash Raj Satires: తిరుపతి లడ్డూ నుంచి మొదలైన వివాదం ఇంకా కొనసాగుతోంది. నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేశారు. ఓ ఉప ముఖ్యమంత్రి సమానత్వం గురించి మాట్లాడుతుంటే మరో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సనాతనమంటూ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 27, 2024, 06:44 PM IST
Prakash Raj Satires: పవన్ ఓ మూర్ఖుడు, విధ్వంస రాజకీయాలు చేస్తున్నాడు

Prakash Raj Satires: ఏపీలో తిరుమల లడ్డూ సృష్టించిన వివారం ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ వివాదంగా మారింది. మత రాజకీయాల బాటపట్టిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇద్దరూ ఒకరిపై మరొకరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్‌పై సంచలన సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రకాష్ రాజ్.

అధికారంలో ఉండి నిజాలు బయటకు తీసి బాధ్యుల్ని కఠినంగా శిక్షించకుండా తిరుమల లడ్డూ అంశాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారంటూ ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతనికేం సంబంధమన్నారు. తాను ఏ మతాన్ని తక్కువ చేసి మాట్లాడటం లేదని చెప్పారు. ఇక అప్పట్నించి ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ఎక్స్ సాక్షిగా పోస్ట్ చేస్తున్నారు. గెలిచే ముందు ఓ అవతాారం, గెలిచాక మరో అవతారం, ఏంటీ అవాంతరం, ఎందుక మనకీ అయోమయం..ఏది నిజం జస్ట్ ఆస్కింగ్ అంటూ కామెంట్ చేశారు. అంతటితో ఆగలేదు..ఇటీవళ తమిళనాడులో జరిగిన ఓ పుస్తకావిష్కరణలో ప్రకాష్ రాజ్ మరోసారి పవన్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు ఎక్కుపెట్టారు. 

ఓ ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సమానత్వం గురించి మాట్లాడుతుంటే మరో ఉప ముఖ్యమంత్రి సనాతన ధర్మం గురించి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నేను ప్రశ్నిస్తే భయపడుతున్నారని..తానెప్పటికీ బలహీనవర్గాల తరపున మాట్లాడుతూనే ఉంటానన్నారు. ఓ మీడియా ఛానెల్‌తో కూడా పవన్ వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ మూర్ఘపు రాజకీయాలు చేస్తున్నాడని, విధ్వంస రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు అతడిని ఎన్నుకున్నది మతపరంగా విడదీసి పాలించేందుకు కాదు కదా అని ప్రశ్నించారు. 

Also read: Venkatesh Second Marriage: విక్టరీ వెంకటేశ్ రెండో పెళ్లి..ఆ హీరోయిన్‌తో జరిగిందా, అసలేం జరిగింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News