Fire Accident: దీపావళికి ముందే దుర్ఘటన.. బాణాసంచా దుకాణంలో భారీ ఫైర్‌ యాక్సిడెంట్‌

Fire Broke Out In Cracker Shop: పండుగకు ముందే హైదరాబాద్‌లో ఘోర సంఘటన చోటుచేసుకుంది. బాణాసంచా దుకాణంలో మంటలు ఎగిసిపడి భయానక పరిస్థితి ఏర్పడింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 27, 2024, 11:39 PM IST
Fire Accident: దీపావళికి ముందే దుర్ఘటన.. బాణాసంచా దుకాణంలో భారీ ఫైర్‌ యాక్సిడెంట్‌

Diwali Festival: దీపావళి పండుగ సందర్భంగా ఏర్పాటుచేసిన బాణాసంచా దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పేలుడు పదార్థాలు ఉండడంతో మంటలు దావానంలా వ్యాపించాయి. దీంతో అక్కడి పరిస్థితి భయానకంగా మారింది. ఏం జరుగుతుందో తెలియక స్థానికులు భయాందోళన చెందారు. దీపావళి పండుగకు ముందే ఈ దుర్ఘటన జరగడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ ప్రమాదం అర్ధరాత్రి హైదరాబాద్‌లో కలకలం రేపింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: KTR Press Meet: అది ఇంట్లో చేసుకున్న దావతయ్యా.. బావ మరిది పార్టీపై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

 

హైదరాబాద్‌లోని అబిడ్స్ పరిధిలో ఉన్న బొగ్గులకుంటలో ఓ బాణసంచా దుకాణంలో ఆదివారం రాత్రి 10- 11 గంటల మధ్య మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించి ఎగసిపడుతున్నాయి. పక్కనున్న హోటల్‌కు కూడా మంటలు వ్యాపించినట్లు సమాచారం. ఈ ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. కాగా ప్రమాదంలో మంటలు అంటుకొని పదికి పైగా వాహనాలు దగ్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోగా.. ఆస్తి నష్టం మాత్రం భారీగా జరిగినట్లు సమాచారం. దీనిపై పోలీస్‌ శాఖ ఇంకా ఎలాంటి కేసు నమోదు చేయనట్టు కనిపిస్తోంది. కాగా ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

Also Read: Harish Rao: ఫ్యామిలీ ఫంక్షన్‌ను డ్రగ్స్‌ పార్టీ చెబుతారా..? బురద జల్లడమే రేవంత్‌ పని

 

కాగా హైదరాబాద్‌లో దీపావళి పండుగకు బాణాసంచా నిషేధిస్తూ రేవంత్‌ రెడ్డి సర్కార్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ నగరంలో దీపావళి పండుగను పురస్కరించుకుని బాణాసంచా కాల్చడం నిషేధం విధించబోతున్నట్లు చర్చ జరుగుతోంది. ఇదే కనుక నిజమైతే హిందూవులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వినాయక నిమజ్జనం సందర్భంగా డీజేలపై నిషేధం విధించిన ప్రభుత్వం ఇప్పుడు దీపావళికి బాణాసంచా నిషేధం విధించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. హిందూ పండుగల విషయంలోనే పర్యావరణం, కాలుష్యం గుర్తుకు వస్తదా? అని హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రేవంత్‌ పాలనలో హిందూవులకు గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News