Summer Effect: ఈ సారి సమ్మర్ హాట్ గురూ..! ఇప్పుడే మండుతున్న ఎండలు..

Summer Hot Effect: ఈ ఎండాకాలం చాలా హాట్‌గా ఉండనుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొద్ది రోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మొత్తంగా సమ్మర్ స్టార్ట్ కాకముందే వేసవి తాపం కాక పుట్టిస్తోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 5, 2025, 08:29 PM IST
Summer Effect: ఈ సారి సమ్మర్ హాట్ గురూ..! ఇప్పుడే మండుతున్న ఎండలు..

Summer Hot: శివరాత్రికి చలి శివ శివ అంటూ పోతుందంటారు. కానీ ఇపుడు మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సంక్రాంతి నుంచే చలి తగ్గిపోయింది. సమ్మర్ హీట్ స్టార్ట్ అయింది. నిన్న మొన్నటి వరకు ఇంట్లో ఫ్యాన్ వేస్తే గజ గజ వణికిపోయే స్థితి నుంచి ఇంట్లో పంకా(ఫ్యాన్) లేకుంటే ఉండలేని పరిస్థితి నెలకొంది. ఇంట్లో ఉక్కబోత.. బయట మండుతున్న ఎండలు ఫిబ్రవరి మొదటి వారంలోనే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు చుక్కులు చూపిస్తున్నాయి. ఫిబ్రవరిలోనే ఈ పరిస్థితులు ఉంటే.. రాబోయే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అని ప్రజలు బెంబెలెత్తిస్తున్నాయి.

భూతాపం కారణంగా 2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించింది. ఇక 2025  ఏడాది కూడా అదే స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ సంస్థ అంచనా వేస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ లో గత రెండు సంవత్సరాల నుంచి వాతావరణంలో తీవ్ర మార్పులు కనపిస్తున్నాయి. ఈ ఇయర్ కూడా సమ్మర్ చాలా హాట్ గా ఉండబోతుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

గత కొన్నేళ్లుగా గ్లోబల్ వార్మింగ్ కారణంగా వేసవి కాలం  పెరుగుతూ వస్తోంది. మార్చి నుంచి ప్రారంభం కావాల్సిన సమ్మర్.. జనవరి చివరి వారం నుంచే ప్రారంభం కావడం ఆందోళన కలిగించే అంశమనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో గత రెండేళ్లుగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ పోతున్నాయి.  

1901 నుంచి సేకరించిన  డాటాను అబ్జర్వర్ చేస్తే  ఇప్పటి వరకు 2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు క్రియేట్ చేసింది. ప్రతి యేడాది సగటున 0.6 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగుతూ వస్తోంది. ఇక 2025 లో అదే పరిస్థితి పునరావృతం కానున్నట్టు తెలుస్తుంది. 

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News