Security Tightened Around CM Jagan Mohan Reddy Residence: తాడేపల్లిలోని సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాస ప్రాంతంలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. కానిస్టేబుల్ అభ్యర్థులు ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో.. సీఎం ఇంటి వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. వివిధ జిల్లాలకు చెందిన దాదాపు వెయి మంది కానిస్టేబుల్ అభ్యర్థులు ముఖ్యమంత్రి నివాసం వైపు వస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ముందస్తుగా భద్రత పటిష్టం చేశారు. తాడేపల్లి వైపు వస్తున్న అభ్యర్థులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ప్రతిఒక్కరిపై నిఘా ఉంచుతూ.. వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
జగన్ సర్కారు పెద్దఎత్తున పోలీస్ కానిస్టేబుల్ నియామకాలను చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్షల ఫలితాలను ఇటీవలె రిలీజ్ చేసింది. మొత్తం 4,59,182 మంది పరీక్షలు రాయగా.. 95,208 మంది అభ్యర్ధులు ఉత్తీర్ణులయ్యారు. అయితే ప్రభుత్వం కటాఫ్ మార్కులు ఎక్కువ పెట్టడంతో చాలామంది క్వాలిఫై కాలేకపోయారని కానిస్టేబుల్ అభ్యర్థులు చెబుతున్నారు.
ప్రిలిమ్స్ పరీక్ష కటాఫ్ మార్కులు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఎలాంటి స్పందన రాకపోవడంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. శనివారం తాడేపల్లిలోని సీఎం నివాసం వద్దకు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించని వారికి మరో ఐదు మార్కులు కలపాలని కానిస్టేబుల్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులకు ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది.
రాష్ట్రంలో మొత్తం 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 35 ప్రాంతాల్లోని 997 పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్ష రాశారు. 200 మార్కులకు పరీక్ష నిర్వహించగా.. ఓసీలకు 40 శాతం, బీసీలకు 35, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 30 శాతం కటాఫ్‌గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులకు ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. తుది దశలో ఫిజికల్, మెడికల్ పరీక్షలుంటాయి.
Also Read: Bandi Sanjay: నూతన సచివాలయంపై బండి సంజయ్ సంచలన కామెంట్స్.. టూంబ్స్ కూల్చేస్తాం..
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 18 నెలల పెండింగ్ డీఏపై త్వరలో ప్రకటన..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి