Nara Brahmani Political Entry: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రక్షాళన దిశగా సీఎం చంద్రబాబు భారీ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న పొలిట్ బ్యూరోతో పాటు.. ఇతర పోస్టులన్నీ కీలక నేతలకు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈసారి ప్రభుత్వంలో పదవులు దక్కని నేతలకు.. పార్టీలో పదవులు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్టును కూడా కొత్త నేతకు ఇస్తారని పార్టీలో టాక్ వినిపిస్తోంది. అయితే లోకేష్‌కు ఈసారి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రమోషన్ దక్కబోతుందని సమాచారం. అటు నారా బ్రహ్మణి పొలిటికల్ ఎంట్రీకి కూడా రోడ్‌మ్యాప్ సిద్దమైనట్టు తెలుస్తోంది. నారా బ్రాహ్మణికి పార్టీలో కీలక పదవి ఇవ్వాలని పార్టీ నేతల నుంచి సీఎం చంద్రబాబుపై ఒత్తిడి పెరిగినట్టు తెలుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ కనివినీ ఎరుగని విజయం సాధించింది. అంతే ఉత్సాహంతో మహానాడును అద్భుతంగా చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే ఈసారి కడప గడ్డపై ఈ సారి మహానాడు నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. కడపలో మహానాడు నిర్వహించడం ద్వారా జగన్‌కు కూడా చెక్ పెట్టొచ్చని నేతలు ఆలోచనగా కనిపిస్తోంది. ఈ మహానాడులోనే మంత్రి నారాలోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే చాన్స్ ఉందని నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఏ పదవి అయినా మూడు సార్లు మాత్రమే ఉండాలని ఇప్పటికే లోకేష్ ప్రకటించారు. దాంతో లోకేష్ ఈసారి ప్రధాన కార్యదర్శి పోస్టులో కొనసాగేందుకు ఆసక్తిగా లేరని తెలుస్తోంది. అయితే ఈసారి నారా లోకేష్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం పార్టీ వ్యవహారాలన్నీ నారా లోకేష్ చూస్తున్నారు. పార్టీ కార్యకర్తల సంక్షేమం, క్యాడర్ కు పదవులు సహా అన్న విషయాల్లోనూ ఆయన తన మార్క్ చూపిస్తున్నారు. అందుకే అధికారికంగా పార్టీపై ఆయనకే పెత్తనం ఇస్తే బాగుంటుందన్న ఆలోచన చేస్తున్నారు. మరోవైపు నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పోస్టుపై ఇటీవల దుమారం చెలరేగింది. డిప్యూటీ సీఎం పోస్టును నారా లోకేష్‌కు ఇవ్వాలని సొంత పార్టీ నేతలు డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంపై జనసేన నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయ్యింది. నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పోస్టు ఇస్తే.. పవన్‌ను సీఎం చేయాలని జనసేన నేతలు ప్రశ్నించారు. దాంతో ఈ వివాదానికి రెండు పార్టీల నేతలు ఎండ్ కార్డ్ వేశారు.
అయితే నారా లోకేష్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఇస్తే.. జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్టు ఎవరికి ఇస్తారనే దానిపై లోతైన చర్చ జరుగుతోందట. ఈ పోస్టును నందమూరి బాలకృష్ణకు ఇవ్వాలనే ఆలోచన సైతం చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ మూడుసార్లు హిందుపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనే బాలకృష్ణకు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఇద్దరు నేతలకు మంత్రులుగా అవకాశం ఇచ్చారు. అప్పట్లో బాలకృష్ణకు మంత్రి పదవి తీసుకోమ్మని సీఎం చంద్రబాబు కోరినా ఆయన వాద్దని చెప్పారట. కానీ ఇప్పుడు బాలయ్య అవసరం పార్టీకి ఎంతైనా అవసరం అని నేతలు చెబుతున్నారట. బాలయ్యకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్టు ఇవ్వడం ద్వారా పార్టీకి మరింత జోష్ వస్తుందని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారట..
మరోవైపు పార్టీ నేతల నుంచి సీఎం చంద్రబాబుపై ఇంకొ ఒత్తిడి కూడా ఉందట. నారా బ్రాహ్మణిని పొలిటికల్ ఎంట్రీ చేయించాలని పార్టీ నేతలు కోరుతున్నారట. ఒకవేళ బాలయ్య జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్టు తీసుకునేందుకు ఓకే చెప్పకపోతే.. నారా బ్రాహ్మణికి ఆ పోస్టు ఇవ్వాలని కోరుతున్నారట. నారా బ్రాహ్మణికి జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్టును ఇస్తే.. పార్టీకి మహిళ ఓటర్లు మరింత దగ్గర అవుతారని చెబుతున్నారట. ఇప్పటికే నారా బ్రాహ్మణి వ్యాపారం రంగంలో తిరుగులేని విజయాలు సాధించారు. ఆమెకు ప్రస్తుత రాజకీయాలపై పూర్తిగా అవగాహన ఉంది. ఈ నేపథ్యంలో బ్రాహ్మణికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్టు ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది.
మొత్తంగా తెలుగుదేశం పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్టుపై మాత్రం సీఎం చంద్రబాబు ఎటు తేల్చుకోలేకపోతున్నట్టు సమాచారం. కానీ నందమూరి లేదా.. నారావారి ఫ్యామిలీలోనే ఏ ఒక్కరికో ఈ పోస్టు దక్కడం ఖాయమని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే త్వరలోనే మహానాడు వేదికగా ఈ పోస్టుపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది..
Also Read: EPFO Updates: పీఎఫ్ ఖాతాదారులకు డబుల్ జాక్‌పాట్.. ఒకేసారి రెండు శుభవార్తలు..!
Also Read: Sai Pallavi: అబ్బాయిలు అలా ఉంటేనే ఇష్టం.. మనసులోని మాట బైటపెట్టిన సాయి పల్లవి.. మ్యాటర్ ఏంటంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter