Sea Recedes At Uppada: మాఘమాసంలో వచ్చిన అతి పవిత్రమైన మాఘ మాసం సమయంలో సముద్రం అనూహ్యంగా వెనక్కి వెళ్లడం కలకలం రేపుతోంది. ఉన్నఫళంగా సముద్రుడు వెనక్కి వెళ్లడంపై ఏపీలో కలకలం రేపుతోంది. పౌర్ణమి రోజు సముద్రం వెనక్కి వెళ్లడం దేనికి సంకేతమనే చర్చ జరుగుతోంది. వాస్తవంగా అమావాస్య సమయంలో సముద్రం వెనక్కి వెళ్లడం జరుగుతుంటుంది. కానీ పౌర్ణమి రోజు వెనక్కి వెళ్లడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఇంతకీ ఏం జరిగింది? ఎక్కడ సముద్రం వెనక్కి వెళ్లిందో తెలుసుకుందాం.
Also Read: WhatsApp Governance: ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలు బంద్? ఇకపై అన్నీ వాట్సప్‌లోనే!
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా పిఠాపురం నియోజవర్గం ఉప్పాడ వద్ద సముద్రం వెనక్కి వెళ్లిపోయింది. వాస్తవానికి బుధవారం మాఘ పౌర్ణమి ఉంది. పౌర్ణమి సందర్భంగా సముద్రం ముందుకు రావాల్సి ఉంది. కానీ దానికి విరుద్ధంగా మంగళవారం ఉప్పాడ బీచ్‌లో సముద్రం వెనక్కి వెళ్లడాన్ని స్థానికులు ఆసక్తిగా గమనించారు. కొన్ని మీటర్ల మేర సముద్రం వెనక్కి వెళ్లడంతో బీచ్‌లో ఇసుక తిన్నెలు భారీగా కనిపించాయి.
Also Read: Maha Shivaratri Gift: శ్రీశైలం భక్తులకు భారీ గిఫ్ట్.. టోల్‌గేట్ ఎత్తివేత, ఉచితంగా లడ్డూ
ఉప్పాడ గ్రామ శివారు పల్లెపేట, సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ శివారు వరకు సముద్రం వెనక్కి వెళ్లిపోయింది. సముద్రం వెనక్కి వెళ్లిన విషయాన్ని తెలుసుకుని గ్రామస్తులతోపాటు పరిసర గ్రామాల ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం ఉదయం పంచ మాధవ క్షేత్రాలలో ఒకటైన పిఠాపురం కుంతీ మాధవస్వామికి చక్రస్నానం చేయించాల్సి ఉంది. ఆనవాయితీ ప్రకారం సముద్రంలో చక్రస్నానం చేయిస్తారు. అయితే సముద్రం నీరు వెనక్కి వెళ్లిపోవడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. అయితే పరిస్థితి బుధవారం ఉదయం వరకు సాధారణ స్థితికి చేరుకుంటుందని స్థానికులు చెబుతున్నారు.
ఒకవేళ ఉదయానికి నీళ్లు ముందుకురాకపోతే ఏం చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. అయితే పౌర్ణమి రోజు సముద్రం వెనక్కి వెళ్లడం దేనికి సంకేతమని స్థానికంగా అందరిలో మొదలుతున్న ప్రశ్న. పౌర్ణమికి సముద్రం ముందుకు రావాల్సి ఉండగా వెనక్కి వెళ్లడం వింతగా ఉంది. సముద్రుడు ఏమైనా ప్రకోపంలో ఉన్నారా అని చర్చ జరుగుతోంది. సముద్రుడు వెనక్కి వెళ్లడంతో మాఘ పౌర్ణమి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేసే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter