AP Politics: హీటెక్కిన పల్నాడు పాలిటిక్స్.. ఎమ్మెల్యే Vs మాజీ మంత్రి

Vidadala Rajini Vs MLA Prathipati Pulla Rao: పల్నాడు జిల్లాలో పాలిటిక్స్‌ హీటెక్కాయా..! ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్‌- వైసీపీ ఇంచార్జ్‌ మధ్య వార్‌ తారాస్థాయికి చేరుకుందా..! ఇటీవల వైసీపీ మాజీమంత్రి టార్గెట్‌గా వరుస కేసులు నమోదవుతున్నాయా..! అందుకే ఆ నేత ఇప్పుడు సిట్టింగ్‌ ఎమ్మెల్యేపై విరుచుకుపడుతున్నారా..! అంతేకాదు. తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్‌ ఇచ్చారు..  

Written by - G Shekhar | Last Updated : Feb 11, 2025, 02:45 PM IST
AP Politics: హీటెక్కిన పల్నాడు పాలిటిక్స్.. ఎమ్మెల్యే Vs మాజీ మంత్రి

Vidadala Rajini Vs MLA Prathipati Pulla Rao: సమ్మర్‌ రాకకు ముందే పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో రాజకీయం వేడెక్కింది. చిలకలూరిపేట సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, మాజీమంత్రి విడదల రజినీ మధ్య పచ్చగడ్డి వేయకున్న భగ్గుమంటోంది. చిలకలూరి పేట కేంద్రంగా ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. ఇటీవల విడదల రజినీపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై ఉక్కుపాదం మోపుతామని కూటమి నేతలు అంటున్నారు. అయితే సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు ధీటైన కౌంటర్ ఇచ్చారు మాజీమంత్రి విడదల రజినీ.. పేటలో మరో 30 ఏళ్లు తానే రాజకీయం చేస్తానని.. తాము అధికారంలోకి రాగానే.. ఎమ్మెల్యే అంతుచూస్తామని హెచ్చరించడంలో పేట పాలిటిక్స్‌ మరోసారి భగ్గుమన్నాయి.. 
 
ఇక 2019 ఎన్నికల్లో పల్నాడు జిల్లా చిలకలూరిపేట నుంచి విడదల రజినీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో రజినీకి మంత్రి పదవి దక్కింది. అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రజినీ ఆగడాలకు హద్దులేకుండా పోయిందని ఆరోపణలున్నాయి. తాజాగా చిలకలూరిపేట ఐటీడీపీలోని ఓ నాయకుడు విడదల రజనీపై కేసు  నమోదు చేయాలని హైకోర్టుకు వెళ్లారు. గత ప్రభుత్వంలో మాజీ మంత్రి విడుదల రజిని తనపై అక్రమంగా కేసు పెట్టి అప్పటి సీఐ సూర్యనారాయణ చేత తన ఐదు రోజులపాటు చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. తాను నిర్బంధంలో ఉన్న సమయంలో అప్పటి విడుదల రజిని పీఏలు రామకృష్ణ, ఫణి ఇరువురు వచ్చి తనను దుర్భాషలాడి తనపై ఉమ్మి వేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తనపై అక్రమ కేసు పెట్టి హింసించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు.. 
 
అయితే ఐటీడీపీకి సంబంధించి సోషల్ మీడియా పోస్టుల విషయంలో విడదల రజినిపై హైకోర్టు కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఐటీడీపీ నాయకుడు పిల్లి కోటి పిటిషన్ పరిశీలించి చర్యలు చేపట్టాలని పల్నాడు జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో విడదల రజినిపై చిలకలూరిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుపై మాజీమంత్రి విడదల రజినీ రియాక్ట్‌ అయ్యారు. పుల్లారావు ఒక అందమైన కట్టు కథ మళ్ళీ నా పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారు. 80 ఏళ్ల పైబడిన మా మామగారిపై కేసు పెట్టించాడు. ఎక్కడో ఫారిన్ లో ఉంటున్న మా మరిది పై అక్రమ కేసు పెట్టించాడు. పుల్లారావు మా కుటుంబం పై అక్రమ కేసులు పెట్టించి కక్ష సాధిస్తున్నాడు. పుల్లారావు గుర్తుపెట్టుకో... మాకే కాదు నీకు కూడా కుటుంబం ఉందంటూ హెచ్చరించారు. అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తే ఖచ్చితంగా దానికి అదే స్థాయిలో రియాక్షన్ ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చిలకలూరిపేటలో పేకాట, అక్రమ మైనింగ్, సెటిల్మెంట్లు, అన్యాయాలు అక్రమాలకు కేరాఫ్ గా మారిందని ఆరోపించారు. 
 
ఇక రజినీ స్ట్రాంగ్ వార్నింగ్‌కు అంతేధీటుగా సమాధానం ఇచ్చారు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. గత ప్రభుత్వంలో విడదల రజినీ అరచకాలన్నీ బయటకు తీస్తామన్నారు. ఆమె మంత్రిగా ఉన్న సమయంలో తిన్నదంతా కక్కిస్తామని చెప్పారు. గతంలో విడదల రజనీ చిలకలూరిపేటలో అక్రమాలకు పాల్పడి గుంటూరుకు పారిపోయారని చురకలంటించారు. ఇప్పుడు మళ్లీ చిలకలూరిపేటకు వచ్చి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 
 
మొత్తంగా ఇద్దరు నేతల సవాళ్లు ప్రతిసవాళ్లలో పేట రాజకీయం మరోసారి హీటెక్కింది.. ఇద్దరు నేతలు తగ్గేదేలేదు అన్నట్టుగా వ్యవహరిస్తుండంతో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందోనంటూ వైసీపీ శ్రేణులు టెన్షన్‌ పడుతున్నట్టు సమాచారం. చూడాలి మరి రానున్న రోజుల్లో పేటలో పాలిటిక్స్‌ ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో..!

 Also Read: ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

 Also Read: Punjab Politics: పంజాబ్ రాజకీయాల్లో సంచలనం.. సీఎంగా కేజ్రీవాల్.. ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News