PM Modi US Tour: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేటి నుంచి ఆగ్రరాజ్యం అమెరికాలో పర్యటిస్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటి కానున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత జరుగుతున్న ఈ భేటిపై ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ ప్రాధాన్యత సంతకరించుకుంది. ముఖ్యంగా అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులతో పాటు ఇతర దేశ ప్రజలను నిర్దాక్షిణ్యంగా గొలుసులు కట్టి ఆయా దేశాలకు డిపోర్ట్ చేస్తున్నారు. ఒక రకంగా ఎన్నో ఆశలతో అమెరికాలో అక్రమంగా అడుగుపెట్టి వారికి ట్రంప్ నిర్ణయం అశనిపాతంగా మారింది.
ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలో వచ్చిన తర్వాత ఇతర దేశాల ఉత్పత్తులపై పన్నులు విధిస్తూ వ్యాపార యుద్ధానికి తెరలేపారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన అత్యంత ప్రాథాన్యత సంతరించుకుంది. ఇరుదేశాల మధ్య వ్యాపారం, పన్ను రాయతీ, అక్రమ వలసదారులు తదితర అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ట్రంప్, మోడీ సమావేశంలో ఇరు దేశాల వాణిజ్యంతో పాటు రక్షణ, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయులను వెనక్కి పంపించే ప్రక్రియ జరుగుతుండగా ఆ అంశంపై కూడా ఈ భేటీలో చర్చ జరగవచ్చు. అమెరికాతో మినీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా డొనాల్డ్ ట్రంప్ రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నరేంద్ర మోడీ భేటి కావడం ఆసక్తి నెలకొంది. మరోవైపు ట్రంప్ ను మోడీ భారత్ కు ఆహ్వానించనున్నారు.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.