Telangana Sarpanch: గ్రామీణ భారతంలో ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేర్చడంలో సర్పంచ్ లదే కీలకపాత్ర. కొంత మంది సర్పంచ్(Sarpanch)లు తమ పదవులకు వన్నె తెస్తే..మరికొందరు ఆ పదవులను దుర్వినియోగం చేస్తుంటారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపాలంటే సర్పంచ్ ముఖ్యుడు. తాజాగా ఓ గ్రామ సర్పంచ్ తన దాతృత్వం మరోసారి చాటి వార్తల్లో నిలిచాడు.
వివరాల్లోకి వెళ్తే..
వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం మరియపురం(Maryapuram Sarpanch) గ్రామ సర్పంచి అల్లం బాలిరెడ్డి(Allam Balreddy) సేవలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన గ్రామాన్ని దేశంలోనే ఆదర్శగ్రామంగా నిలిపిన ఘనుడు అతను. తాజాగా మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. నిర్మల ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్‌గా ఉన్న బాలిరెడ్డి.. ఆడపిల్లకు జన్మనిస్తే(girl child) రూ.10 వేల కానుక ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 'సుకన్య సమృద్ధి యోజన' కింద ఆడబిడ్డ పేరుతో బ్యాంకులో ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయనున్నట్లు వెల్లడించారు.
Also read: తెలంగాణ: మద్యం దుకాణాల ఏర్పాటుకు అధిక సంఖ్యలో దరఖాస్తులు..ఒక్క రోజే 15 వేలు..
2019 ఫిబ్రవరిలో సర్పంచి(Sarpanch)గా తాను పదవి చేపట్టిన నాటి నుంచి గ్రామంలో 8 మంది ఆడపిల్లలు జన్మించారని, వారందరి పేరిట డబ్బు డిపాజిట్(Deposit) చేయనున్నట్లు చెప్పారు. తాను సర్పంచ్ పదవిలో ఉన్నంత కాలం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానన్నారు. ఈ నెల 20న నిర్మల ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 8 మంది బాలికల తల్లిదండ్రులకు డిపాజిట్ పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook