Chandra Gochar 2025 Effect: సూర్యుడు పాలించే సింహరాశిలోకి చంద్రుడు ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా హోలీ పండుగ నుంచి కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే జీవితంలో ఊహించని డబ్బు కూడా పొందగలుగుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Chandra Gochar 2025 Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ గ్రహమైన ఒక రాశి నుంచి మరో రాశికి చేంజ్ అయినప్పుడు మొత్తం 12 రాశుల వారిపై ప్రభావం పడుతుందని అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రభావం అనేది రెండు రకాలుగా ఉంటుంది. కొన్ని రాశుల వారి వ్యక్తిగత జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకువచ్చే ప్రభావం ఉంటుంది. మరొక ప్రభావం కొన్ని రాశుల వారి జీవితాల్లో ప్రతికూల పరిస్థితులను తీసుకువస్తుంది. ఈ ప్రభావం అనేది గ్రహ పరిస్థితులు, గ్రహాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.
ఇదిలా ఉంటే త్వరలోనే చంద్రుడు రాశి సంచారం చేయబోతున్నాడు. అదికూడా ఎంతో ప్రత్యేకత కలిగిన సూర్యుడు అధిపతిగా వ్యవహరించే రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ ప్రభావం కూడా మొత్తం ద్వాదశరాశిల వారిపై పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
చంద్ర గ్రహం మార్చి 12వ తేదీన అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన సింహరాశిలోకి ప్రవేశించబోతోంది. ఈ గ్రహం చాలా అరుదుగా సింహరాశిలోకి ప్రవేశిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే సూర్యుడి రాశిలోకి చంద్రుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశులకు వారికి మేలు జరుగుతుంది.
సూర్యుడు పాలించే సింహరాశిలో చంద్రగ్రహణం మార్చి 14వ తేదీన సంపూర్ణంగా సంచార దశలోకి వెళ్తుంది.. దీనివల్ల హోలీ పండుగ నుంచి మూడు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో అదృష్టాన్ని పొందబోయే రాశులేవో ఇప్పుడు తెలుసుకోండి.
మిథున రాశికి చంద్రుడు సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెప్తున్నారు. వీరికి సానుకూల మార్పులు రావడమే కాకుండా జీవితంలో ఎదురవుతున్న సమస్యలు తొలగిపోతాయి. చాలా కాలంగా వస్తున్న వివాదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఉద్యోగాలు చేస్తున్న వారికి సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది.
చంద్రుడి సంచారం ఎఫెక్ట్ సింహ రాశి వారిపై కూడా పడుతుంది.. ఈ రాశి వారికి ఉద్యోగాల్లో అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా వీరికి ప్రమోషన్స్ లభించడమే కాకుండా జీతాలు కూడా భారీగా పెరుగుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా ఊహించని స్థాయిలో డబ్బులు పొందగలుగుతారు. ఆత్మవిశ్వాసం, గౌరవం పెరుగుతుంది.
వృశ్చిక రాశి వారికి కూడా అనుకున్నట్టు ఈ సమయంలో జరుగుతుంది. హోలీ నుంచి ఈ రాశి వారికి ఆర్థికపరంగా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారాలు చేస్తున్నవారు లాభాలు కూడా పొందగలుగుతారు. అలాగే వివాహాలు కాని వారు ఈ సమయంలో అద్భుతమైన శుభవార్తలు వింటారని జ్యోతిష్యులు చెబుతున్నారు.