Telugu Academy: తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసులో ముగ్గురి అరెస్ట్

Telugu Academy Deposit Scam: డబ్బు మాయంపై బ్యాంకు అధికారుల పాత్ర ఉందంటూ తెలుగు అకాడమీ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 1, 2021, 06:49 PM IST
  • తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్‌మాల్‌ కేసులో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు
  • కోట్ల రూపాయల డిపాజిట్లను దారి మళ్లించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడి
Telugu Academy: తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసులో ముగ్గురి అరెస్ట్

Three arrested in Telugu Academy Deposit Scam case: తెలుగు అకాడమీ (Telugu Academy) డిపాజిట్ల గోల్‌మాల్‌ కేసులో సీసీఎస్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. యూనియన్‌ బ్యాంక్‌ (Union Bank) మేనేజర్‌ మస్తాన్‌ వలీ, అగ్రసేన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ పద్మావతి, ఏపీ మర్కంటైల్‌ క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ ఉద్యోగి మొహినుద్దిన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు కోట్ల రూపాయల డిపాజిట్లను దారి మళ్లించినట్లు పోలీసుల (Police) ప్రాథమిక విచారణలో తేలింది.

డబ్బు మాయంపై బ్యాంకు అధికారుల పాత్ర

330 కోట్ల రూపాయలను తెలుగు అకాడమీ 11 బ్యాంకుల్లోని 34 ఖాతాల్లో డిపాజిట్‌ చేసింది. ప్రధానంగా యూనియన్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంకుల్లో (canara bank) డిపాజిట్లు ఉన్నాయి. అయితే డబ్బు మాయంపై బ్యాంకు అధికారుల పాత్ర ఉందంటూ తెలుగు అకాడమీ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కాగా సరైన పత్రాలు చూశాకే డిపాజిట్లు క్లోజ్‌ చేశామని బ్యాంకు ప్రతినిధులు పోలీసులకు తెలిపారు.

Also Read : Republic Movie Review: సాయి ధరమ్ తేజ్ నటించిన "రిపబ్లిక్" మూవీ రివ్యూ

డిపాజిట్ల రద్దు వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు

అయితే ఏపీ వర్తక సహకార సంఘం ఏర్పాటు చేసినట్లు లేఖ సృష్టించి అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. డిపాజిట్లు (deposits) రద్దు చేయాలని అధికారుల పేర్లతో బ్యాంకులకు లేఖ రాశారు. డిపాజిట్ల రద్దు వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. తెలుగు అకాడమీ (Telugu Academy) నిధుల గోల్‌మాల్‌పై ఇప్పటికే త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి వరకు మరి కొందరిని అరెస్ట్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అకాడమీ ఉద్యోగులను కూడా సీసీఎస్‌ పోలీసులు (CCS‌ Police) విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలను పోలీసులు ఛేదించనున్నారు.

Also Read : Gandhi Jayanti 2021: గాంధీ జయంతి సందర్భంగా చూడాల్సిన టాప్ 5 చిత్రాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News