Allu Arjun: అల్లు అర్జున్ కు పోలీసుల మరో షాక్..

Police Shock To Allu Arjun: అల్లు అర్జున్ కు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. అంతేకాదు శ్రీతేజ్ ను పరామర్శించడానికి బన్ని వెళ్లకూడదంటూ రాంగోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు నోటీసులు అందించారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 5, 2025, 12:33 PM IST
Allu Arjun: అల్లు అర్జున్ కు పోలీసుల మరో షాక్..

Police Shock To Allu Arjun: తెలంగాణ పోలీసులు మరోసారి అల్లు అర్జున్ కు షాక్ ఇచ్చారు. తెలంగాణలోని రేవంత్ సర్కార్ మాత్రం తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెంది.. ఆమె కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు కాంగ్రెస్ నాయకులు.. శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నా అల్లు అర్జున్ తో పాటు ఇతర హీరోలెవరు ఆ బాలుడిని పరామర్శించలేదని చెబుతూ వస్తున్నారు. తీరా చూస్తే మాత్రం అల్లు అర్జున్ తో పాటు ఇతర హీరోలు ఆ బాబును పరామర్శాస్తామంటే మాత్రం కలవకుడా డ్డుకుంటున్నారు. ఓవైపు హీరోలు పరామర్శిండం లేదని వీళ్లే అంటారు. మరోవైపు పరామర్శించేందుకు వచ్చే హీరోలకు పర్మిషన్ ఇవ్వరు. ఇదంత చూస్తుంటే.. అమ్మ పెట్టదు.. అయ్య అడక్కతిననీయడు అన్న దుస్థితి నెలకొంది.

ఇప్పటికే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ తో పాటు దిల్ రాజు, నిర్మాతలు వెళ్లి పరామర్శించారు. అంతేకాదు వాళ్ల కుటుంబానికి జరిగిన నష్టానికి రూ. 2 కోట్ల పరిహారం అందజేసారు. మరోవైపు అల్లు అర్జున్..శ్రీతేజ్ ను కలవకూడదని రామ్ గోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్ కు నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక  డిసెంబర్‌ 4న పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్.. ఆర్టీసీ క్రాస్ రోడ్స లో ఉన్న సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అని యువతి తొక్కిసలాటలో ప్రాణాలు ఒదలింది. మరోవైపు ఈ తొక్కిసలాటలో రేవతి కుమారుడు శ్రీతేజ్.. హైదరాబాద్ కిమ్స్ లో వెంటిటేటర్ పై  చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే ఈ కేసులో అల్లు అర్జున్ పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. మరోవైపు ఈ కేసులో మధ్యంతర బెయిల్ పై  అల్లు అర్జున్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే కదా. సంధ్య టాకీస్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై  18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో అల్లు అర్జున్ A11గా నిందితుడిగా ఉన్నారు. డిసెంబర్‌ 13న అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించింది. అనంతరం రూ. 50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో నాలుగు వారాల మధ్యంత బెయిల్‌ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు అల్లు అర్జున్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఈ ఇష్యుపై ఎవరు మాట్లాడకూడదని హెచ్చరించారు. మరోవైపు కొంత మంది నెటిజన్స్ అల్లు అర్జున్ .. సల్మాన్ ఖాన్ లా ఫుట్ పాత్ పై పడుకున్న వారిపై మదమెక్కి కారు ఎక్కించలేదు కదా..మరోవైపు కృష్ణ జింకలను వేటాడాడా.. షారుఖ్ ఖాన్ కుమారుడు మాదిరి డ్రగ్స్ తీసుకున్నాడా.. తన ప్రమేయం లేకుండా జరిగిన ఘటనపై ఆయన్ని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ నెటిజన్స్ తెలంగాణ ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో నిర్మాతలకు కూడా ఊరట లభించింది.  

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News