DK Aruna: 'లగచర్ల లడాయి' తీవ్ర రూపం.. డీకే అరుణ అరెస్ట్‌తో తీవ్ర ఉద్రిక్తత

MP DK Aruna Arrest At Moinabad: లగచర్ల లడాయి తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది. దళిత, గిరిజనులపై పోలీసులు విరుచుకుపడడంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమతోంది. వారిని పరామర్శించేందుకు వెళ్తున్న డీకే అరుణను పోలీసులు అరెస్ట్‌ చేయడం రచ్చ రేపుతుంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 18, 2024, 06:35 PM IST
DK Aruna: 'లగచర్ల లడాయి' తీవ్ర రూపం.. డీకే అరుణ అరెస్ట్‌తో తీవ్ర ఉద్రిక్తత

DK Aruna Arrest: తెలంగాణలో లగచర్ల గ్రామంలో పోలీసులు చేస్తున్న దాష్టీకం రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. ఇప్పటికే బాధితులు జాతీయ స్థాయిలో పోరాటం చేస్తుండగా.. స్థానికంగా లగచర్ల బాధితులకు అండగా నిలిచేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈ క్రమంలోనే తన సొంత నియోజకవర్గం మహబూబ్‌నగర్‌ వెళ్లేందుకు ప్రయత్నించగా ఎంపీ డీకే అరుణను అడ్డుకుని ఆమెను అరెస్ట్‌ చేయడం కలకలం రేపింది. లగచర్ల పర్యటనకు వెళ్లకుండా అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై కాషాయ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Also Read: KTR Press Meet: బట్టలిప్పినట్టు రేవంత్‌ రెడ్డి వైఫల్యాల చిట్టా విప్పిన కేటీఆర్‌

రేవంత్‌ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్ల గ్రామాన్ని సందర్శించేందుకు ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్‌తోపాటు ఎమ్మెల్యే సోమవారం బయల్దేరారు. హైదరాబాద్‌ దాటాక మొయినాబాద్ వద్ద పోలీసులు అడ్డగించారు. కాన్వాయ్‌ను ఆపివేసి మీరు వెళ్లేందుకు అనుమతి లేదని నిలువరించారు. కొద్దిసేపు పోలీసులతో అరుణ, ఈటల వాగ్వాదానికి దిగారు. మీకు అనుమతి లేదని చెప్పడంతో ఎంపీ అరుణ భీష్మించుకుని కారులోనే కూర్చోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read: Telangana Survey: ఇంటింటి సర్వేపై అదే నిర్లక్ష్యం.. 12 రోజులలో 58 శాతమే పూర్తి

తన పర్యటనను అడ్డుకోవడంతోపాటు తనను అరెస్ట చేయడంపై ఎంపీ అరుణ మాట్లాడారు. రేవంత్‌ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్‌ రెడ్డి ఒక దద్దమ్మ అని మండిపడ్డారు. 'తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా చచ్చిపోయిందా? ఒక ఎంపీగా ఉన్న నన్ను నా నియోజకవర్గంలో తిరగనివ్వరా?' అని అరుణ ప్రశ్నించారు. ఇదేమైనా దౌర్జన్యమా అంటూ పోలిసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్ రేవంత్ రెడ్డి జాగీరా? అని నిలదీారు.

'ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మా రైతులను కొడుతున్నారు. నా నియోజకవర్గానికి వెళ్లనీయకుండా నన్ను అడ్డుకుంటారా? మిస్టర్ రేవంత్  రెడ్డి కొడంగల్ ఒక్క నియోజకవర్గమే కాదు నేను ఎంపీగా ఉన్నా. సొంత నియోజకవర్గంలో శాంతి భద్రతలు నియంత్రించలేక నన్ను ఆపుతావా?' అని ఎంపీ అరుణ మండిపడ్డారు. 'ఈ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. మిస్టర్ రేవంత్ రెడ్డి నీ జులుం ఇక్కడ సాగదు ఖబడ్దార్. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తా అంటే సాగదు' అని హెచ్చరించారు. రేవంత్‌ రెడ్డి నీకు అంత దమ్ము ఉంటే సీఎంగా రాజీనామా చేయ్‌ అని సవాల్‌ చేశారు. రాజీనామా చేసి కొడంగల్‌లో పోటీ చేయ్.. ఎన్నికలకు రా చూసుకుందాం అని చాలెంజ్‌ విసిరారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News