ktr hot comments on cm revanth reddy and ponguleti: కాంగ్రెస్ మంత్రి పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి ఇటీవల సియోల్ నుంచి మాట్లాడుతూ.. దీపావళికి ముందు తెలంగాణలో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయన్నారు. అంతే కాకుండా.. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ధరణి వంటి వాటిలో అక్రమాలకు పాల్పడిన వారంతా అరెస్ట్ అవుతారని పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా.. తాము కేవలం ఆరోపణలు చేయడంలేదని, ఆధారాలతో సహా ప్రజల ముందు బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను ఉంచుతామని కూడా పొంగులేటీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఈ చిట్టి నాయుడు గాడికి మేమేం భయపడం.
కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి.. ఏం పీక్కుంటారో పీక్కొండి - కేటీఆర్ pic.twitter.com/brg81vhKS9
— Telugu Scribe (@TeluguScribe) October 25, 2024
తాజాగా, దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లాలో మాట్లాడారు. మంత్రి పోంగులేటీ చేసిన వ్యాఖ్యలకు అదే విధంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో.. మంత్రి పొంగులేటీ వ్యాఖ్యలపై.. తెలంగాణలో బాంబు అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన మీద జరిగిన ఈడీ రైడ్ మీద ఏమన్న చెబుతాడేమో?.. అంటు సెటైర్ లు వేశారు. అదే విధంగా.. ఈడీ దాడుల్లో ఎన్ని నోట్ల కట్టలు దొరికాయి. ఎన్ని కట్టల పాములు దొరికినయన్నది చెబుతాడా?.. అంటూ ఫైర్ అయ్యారు. అంతే కాకుండా.. ఎట్ల బీజేపీ తో సంధి కుదుర్చుకున్నది, ఎట్ల బీజేపీని బతిమిలాడి కేసు కాకుండా చూసుకున్నది.. ఆదానీ కాళ్లు పట్టుకున్నది ఆ బాంబు ఏదైనా చెబుతాడా?.. అంటూ కౌంటర్ వేశారు.
అదే విధంగా.. అమృత్ పథకంలో భాగంగా ముఖ్యమంత్రి బావమరిది కి 1,137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి స్కాం చేశారని నేను ఆరోపిస్తున్నా… దాని మీద బీజేపీ వాళ్లు మాత్రం ఇప్పటి వరకు స్పందించటం లేదని,దీని మీద విచారణకు ఆదేశించే బాంబు ఏమైనా పేల్చుతారా?.. అంటూ ఏకీ పారేశారు. పొంగులేటీ పేల్చబోయేది.. లక్ష్మి బాంబా? సుతిలి బాంబా? తుస్సు బాంబా?.. అన్ని తొందరలోనే తేలుతాయని తనదైన స్టైల్ లో రెచ్చిపోయారు.
నా మీద ఏమైనా కేసు పెట్టాలనుకుంటే ఏం పెట్టుకుంటావో పెట్టుకో... ఏం పీక్కుంటావో పీక్కో... ఇటువంటి కొత్త బిచ్చగాళ్లను చాలా మందిని మేము చూశామని ఘాటుగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు లాంటి వాళ్లతోనే కొట్లాడాం. ఈ చిట్టి నాయుడు మాకు పెద్ద లెక్క కాదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
తెలంగాణ కోసం.. చావును సైతం తెగించి కొట్లాడినం అని, ఈ హౌలగాళ్ల పిచ్చి డైలాగులకు భయపడేటోడు ఎవడు లేడని మండిపడ్డారు. వర్జినల్ బాంబులకే భయపడలేదు. వీళ్ల తుస్సు బాంబులకు ఏవడు భయపడతారంటూ కూడా కేటీఆర్ పొంగులేటీపై పంచ్ లు వేశారు. అంతే కాకుండా.. మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమే. అప్పుడు వాళ్లను చూసుకునే బాధ్యత కూడా నాదే.. కేటీఆర్ కాంగ్రెస్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter